army base
-
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భీకర దాడి
డెయిర్ అల్–బలాహ్: ఇజ్రాయెల్‌లోని ఆర్మీ బేస్‌పై ఆదివారం హెజ్బొల్లా చేపట్టిన భీకర దాడిలో నలుగురు సైనికులు చనిపోగా మరో 61 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. రెండు వారాల క్రితం లెబనాన్‌లో తాము భూతల దాడులు మొదలు పెట్టాక హెజ్బొల్లా జరిపిన అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్ పేర్కొంది. గురువారం బీరుట్‌పై చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఆదివారం బిన్యామియా నగరంపై డ్రోన్లతో దాడి చేశామని హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రత్యేక బలగాలైన ‘గొలాన్ బ్రిగేడ్’లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను నిరీ్వర్యం చేసేందుకు డజన్ల కొద్దీ మిస్సైళ్లను, అదే సమయంలో పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించామని పేర్కొంది. ఇజ్రాయెల్ వద్ద అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలున్నప్పటికీ క్షిపణులు, డ్రోన్ల దాడిలో ఇంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లడం చాలా అరుదైన విషయమని చెబుతున్నారు. స్కూలుపై దాడి..20 మంది మృతి గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంలోని స్కూలుపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో పలువురు చిన్నారులు సహా 20 మంది చనిపోయారు. సోమవారం ఉదయం డెయిర్ అల్–బలాహ్లోని అల్ అక్సా మారి్టర్స్ ఆస్పత్రి వెలుపల జరిగిన మరో దాడిలో ముగ్గురు చనిపోయారు. దాడులతో టెంట్లతో మంటలు చెలరేగి, 50 మందికి కాలిన గాయాలయ్యాయి. లెబనాన్‌లో 21 మంది మృత్యువాత లెబనాన్‌లో ఉత్తర ప్రాంత అయిటో నగరంలోని ఓ చిన్న అపార్టుమెంట్ భవనంపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 21 మంది చనిపోయారని రెడ్ క్రాస్ తెలిపింది. హెజ్బొల్లా బలంగా ఉన్న దక్షిణ లెబనాన్, బీరుట్ ఉత్తర శివారు ప్రాంతాలపైనే ప్రధానంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ ఉత్తర భాగంపై దాడికి దిగడం ఇదే మొదటిసారి. ‘ఐరాస దళాల మాటున హెజ్బొల్లా’లెబనాన్‌లోని శాంతి పరిరక్షక దళాలు హెజ్బొల్లా మిలిటెంట్లకు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగపడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. ఐరాస దళాల ముసుగులో హెజ్బొల్లా మిలిటెంట్ల కార్యకలాపాలు దక్షిణ లెబనాన్ ప్రాంతంలో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని విమర్శించారు. తమ బలగాలు హెచ్చరికలను పాటించి, ఆ ప్రాంతం నుంచి వెంటనే ఐరాస బలగాలు వైదొలగాలన్నారు. ఉత్తర గాజాను ఖాళీ చేయించేందుకు ప్రయత్నం ఉత్తర గాజా ప్రాంతంలో ఉన్న సుమారు 4 లక్షల మందిని అక్కడి నుంచి ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లి పోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. వీరిని ఎలాగైనా ఖాళీ చేయాలనే లక్ష్యంతోనే ఈ నెల ఒకటోతేదీ నుంచి ఈ ప్రాంతానికి ఆహార సరఫరాను సైతం నిలిపివేసింది. వెళ్లకుండా అక్కడే ఉండే వారిని మిలిటెంట్లుగా గుర్తించేందుకు ఉద్దేశించిన ప్రణాళికను మాజీ సైనిక జనరళ్లు ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం. -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా డ్రోన్ దాడి.. నలుగురి సైనికులు మృతి
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరంపై హెజ్బొల్లా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. హైఫాకు దక్షిణంగా ఉన్న బిన్యామినా పట్టణానికి సమీపంలో ఆదివారం ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. లెబనీస్ హెజ్బొల్లా గ్రూప్ ఇజ్రాయెల్ సైనిక శిబిరాన్ని డ్రోన్లతో టార్గెట్ చేసినట్ల తెలిపింది.అయితే ఈ దాడికి ముందు ఎటువంటి హెచ్చరిక సైరన్లు వినిపించకపోవటం గమనార్హం.Hezbollah UAV strike on Israeli army base kills 4 IDF soldiersRead @ANI Story | https://t.co/k9xhKHZCmS#Israel #UAVstrike #Hezbollah #IDF pic.twitter.com/witCwWBOTD— ANI Digital (@ani_digital) October 13, 2024 నిన్న(ఆదివారం) హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రయోగించిన యూఏఈ ఇజ్రాయెల్ ఆర్మీ స్థావరాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) సైనికులు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాం. గాయపడిన వ్యక్తుల పేర్లను వ్యాప్తి చేయటం. పుకార్లు సృష్టించటం మానుకొని సైనికులు కుటుంబాలను గౌరవించాలని కోరుతున్నాం’అని ఇజ్రాయెల్ ఆర్మీ ‘ఎక్స్’లో పేర్కొంది.హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లోని ఇజ్రాయెల్ త్స్నోబార్ లాజిస్టిక్స్ స్థావరాన్ని కూడా క్షిపణలుతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇక.. హెజ్బొల్లా డ్రోన్ దాడుల నుంచి రక్షణను బలోపేతం చేయటంలో సహాయపడటానికి ఇజ్రాయెల్‌కు కొత్త వైమానిక రక్షణ వ్యవస్థను పంపనున్నట్లు అమెరికా ప్రకటించిన ఈ డ్రోన్ దాడులు జరగటం గమనార్హం.చదవండి: ఆ రిపోర్ట్‌లో నిజం లేదు: ఇరాన్ -
ట్రెయినీ ఆర్మీ అధికారులపై దాడి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. యువ సైనికాధికారులను తీవ్రంగా కొట్టి, వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇండోర్ సమీపంలోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు అధికారులు, తమ స్నేహితురాళ్లతో కలిసి బుధవారం మధ్యాహ్నం చోటీ జామ్ వద్ద ఫైరింగ్ రేంజ్ సమీపంలోని ప్రదేశానికి పిక్నిక్కు వెళ్లారు.తుపాకులు, కత్తులు, కర్రలతో వచ్చిన 8 మంది దుండగులు అకస్మాత్తుగా వారిని చుట్టుముట్టారు. నలుగురినీ చితకబాది వారివద్ద డబ్బు, విలువైన వస్తువులను దోచుకున్నారు. ఒక అధికారిని, అతడి స్నేహితురాలిని బందీలుగా ఉంచుకున్న దుండగులు రూ.10 లక్షలు తెస్తేనే విడిచిపెడతామంటూ మరో అధికారి, అతడి స్నేహితురాలిని పంపించారు. బాధితుడు హుటాహుటిన తన యూనిట్‌కు వెళ్లి కమాండింగ్ అధికారికి సమాచారమిచ్చారు. ఈ మేరకు పోలీసులు, మిలటరీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోగా.. వారిని చూసి దుండగులు పారిపోయారు. నలుగురు బాధితులను పోలీసులు మోవ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి. ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. దోపిడీ, అత్యాచారం, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. మోవ్ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో శాంతి భద్రతలు మచ్చుకైనా కానరావడం లేదని దుయ్య బట్టారు. మహిళలపై జరుగుతున్న నేరాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళనకర అంశమని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
మసీదులో పేలుడు: 27 మంది మృతి
కాబూల్: అఫ్గాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్సులో ఉన్న ఆర్మీ బేస్‌లో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఆర్మీ బేస్‌లోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు పూర్తవుతున్న సందర్భంగా జరిగిన ఈ పేలుడులో 27 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 57 మంది తీవ్రంగా గాయపడ్డారు. రిమోట్ కంట్రోల్ లేదా ఆత్మాహుతి దళ సభ్యుడి ద్వారా ఉగ్రవాదులు ఈ దాడి చేయించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ దాడిని తామే చేసినట్లు ఏ ఉగ్రసంస్థా ఇంతవరకూ ప్రకటించుకోలేదు. -
పాక్ ఆర్మీపై తాలిబాన్ల ఆత్మాహుతి దాడి
పెషావర్: పాకిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్వాత్ జిల్లాలోని ఆర్మీ యూనిట్ లక్ష్యంగా ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఓ మేజర్ సహా 11 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, 13 మంది గాయపడ్డారు. తాలిబాన్లకు గట్టి పట్టున్న స్వాత్ లోయలోని ఆర్మీ బేస్ సమీపంలో శనివారం ఈ దాడి జరిగినట్లు పాక్ ఆర్మీ మీడియా విభాగం తెలిపింది. తొలుత నిషేధిత ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన ఉగ్రవాది.. ఆర్మీ బేస్ బయట వాలీబాల్ ఆడుతున్న సైనికులు లక్ష్యంగా తనను తాను పేల్చేసుకున్నాడని వెల్లడించింది. -
ఆర్మీ బేస్‌పై దాడి 50మంది సైనికులు మృతి
-
ఆర్మీ బేస్‌పై ఉగ్ర దాడి: 50 మంది మృతి
కాబూల్: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మిలిటరీ యూనిఫాంలో వచ్చి ఆర్మీ బేస్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 50 మంది సైనికులు మృతిచెందారు. ఆఫ్గనిస్తాన్ ఉత్తరప్రాంతంలోని మజర్-ఇ-షరీఫ్ నగరం సమీపంలో ఉన్న ఆర్మీబేస్‌పై శుక్రవారం ఉగ్రవాదులు దాడి చేశారు. సుమారు 10 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. వారిలో ఇద్దరు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఏడుగురు ఉగ్రవాదులను కౌంటర్ ఆపరేషన్‌లో సైనికులు కాల్చిచంపగా.. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ బేస్‌పై ఉగ్రవాదుల దాడిలో 50 మందికి పైగా ఆఫ్గన్ సైనికులు మృతి చెందారని యూఎస్ మిలిటరీ స్పోక్స్‌పర్సన్ మీడియాతో వెల్లడించారు. ఆర్మీబేస్ వద్దగల మసీదు, డైనింగ్ హాల్‌లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. -
ఆఫ్రికా దేశం మాలిలో మారణ హోమం
-
అమెరికన్ ఆర్మీ స్థావరంలో కాల్పులు, నలుగురు మృతి
అమెరికాలోని టెక్సాస్ లోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరం తుపాకీ కాల్పులతో మార్మోగింది. ఈ సంఘటనలో నలుగురు చనిపోయారు. మరో 11 మంది గాయపడ్డారు. గత ఆరు నెలల్లో అమెరికన్ సైనిక స్థావరాల్లో కాల్పులు జరగడం ఇది మూడో సారి. ఫోర్ట్ హుడ్ లో ఇది రెండవ సారి. స్థానిక టీవీల కథనాల ప్రకారం ప్రజలను తలుపులు, కిటికీలు మూసుకోవాలసిందిగా మైక్ ల ద్వారా ప్రకటనలు వెలువడ్డాయి. పోలీసులు ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు, ఆంబులెన్స్ లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 2009 లో ఒక ముస్లిం మత గురువు ప్రేరణతో ఒక ఆర్మీ సైకియాట్రిస్టు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 13 మందిని పొట్టనబెట్టుకున్నాడు. మరొక 32 మందిని తీవ్రంగా గాయపరిచాడు. గత సెప్టెంబర్ లో వాషింగ్టన్ నేవీ యార్డులో ఇలాంటి సంఘటనే జరిగింది. అందులో 12 మంది చనిపోయారు. గత నెల వర్జీనియాలోని అమెరికన్ నేవీ బేస్ లో ఒక పౌరుడు కాల్పులు జరపడంతో ఒక నేవీ సైనికుడు చనిపోయాడు. . తాజా ఫోర్ట్ హుడ్ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ఒబామా తీవ్ర దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు.