ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరంపై హెజ్‌బొల్లా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.
హైఫాకు దక్షిణంగా ఉన్న బిన్యామినా పట్టణానికి సమీపంలో ఆదివారం ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. లెబనీస్ హెజ్‌బొల్లా గ్రూప్ ఇజ్రాయెల్ సైనిక శిబిరాన్ని డ్రోన్‌లతో టార్గెట్ చేసినట్ల తెలిపింది.అయితే ఈ దాడికి ముందు ఎటువంటి హెచ్చరిక సైరన్‌లు వినిపించకపోవటం గమనార్హం.
Hezbollah UAV strike on Israeli army base kills 4 IDF soldiers
Read @ANI Story | https://t.co/k9xhKHZCmS#Israel #UAVstrike #Hezbollah #IDF pic.twitter.com/witCwWBOTD— ANI Digital (@ani_digital) October 13, 2024
నిన్న(ఆదివారం) హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రయోగించిన యూఏఈ ఇజ్రాయెల్ ఆర్మీ స్థావరాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) సైనికులు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాం. గాయపడిన వ్యక్తుల పేర్లను వ్యాప్తి చేయటం. పుకార్లు సృష్టించటం మానుకొని సైనికులు కుటుంబాలను గౌరవించాలని కోరుతున్నాం’అని ఇజ్రాయెల్ ఆర్మీ ‘ఎక్స్’లో పేర్కొంది.
హెజ్‌బొల్లా ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లోని ఇజ్రాయెల్ త్స్నోబార్ లాజిస్టిక్స్ స్థావరాన్ని కూడా క్షిపణలుతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇక.. హెజ్‌బొల్లా డ్రోన్ దాడుల నుంచి రక్షణను బలోపేతం చేయటంలో సహాయపడటానికి ఇజ్రాయెల్‌కు కొత్త వైమానిక రక్షణ వ్యవస్థను పంపనున్నట్లు అమెరికా ప్రకటించిన ఈ డ్రోన్ దాడులు జరగటం గమనార్హం.
చదవండి: ఆ రిపోర్ట్‌లో నిజం లేదు: ఇరాన్
Comments
Please login to add a commentAdd a comment