ఆర్మీ బేస్‌పై ఉగ్ర దాడి: 50 మంది మృతి
కాబూల్: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మిలిటరీ యూనిఫాంలో వచ్చి ఆర్మీ బేస్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 50 మంది సైనికులు మృతిచెందారు.
ఆఫ్గనిస్తాన్ ఉత్తరప్రాంతంలోని మజర్-ఇ-షరీఫ్ నగరం సమీపంలో ఉన్న ఆర్మీబేస్‌పై శుక్రవారం ఉగ్రవాదులు దాడి చేశారు. సుమారు 10 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. వారిలో ఇద్దరు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఏడుగురు ఉగ్రవాదులను కౌంటర్ ఆపరేషన్‌లో సైనికులు కాల్చిచంపగా.. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ బేస్‌పై ఉగ్రవాదుల దాడిలో 50 మందికి పైగా ఆఫ్గన్ సైనికులు మృతి చెందారని యూఎస్ మిలిటరీ స్పోక్స్‌పర్సన్ మీడియాతో వెల్లడించారు. ఆర్మీబేస్ వద్దగల మసీదు, డైనింగ్ హాల్‌లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని వెల్లడించారు.