కాబుల్: లోగర్ రాష్ట్రంలోని కోర్టుపై మిలిటెంట్లు ఆదివారం దాడి చేయడంతో 10 మంది మరణించారు. మృతుల్లో ఒక సీనియర్ న్యాయమూర్తి కూడా ఉన్నారు. 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మాహుతి బాంబర్లు కోర్టుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 11 గంటలకు పుల్-ఎ-ఆలమ్లో జరిగినట్లు పోలీసులు తెలిపారు.
దాడిలో ఐదుగురు సాధారణ పౌరులు మరణించారు. లోగర్ ప్రాంతీయ అప్పీల్ కోర్టు భవనంలో దాడి జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కోర్టు ప్రధాన న్యాయమూర్తి అక్రమ్ నేజల్ ఈ దాడిలో మరణించారు. నేజత్ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలే నియమితులయ్యారు. ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు దాడిలో పాల్గొన్నారు. కోర్టు భవనం లోపల ఒక ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
కోర్టుపై మిలిటెంట్ల దాడి
Published Sun, Jun 5 2016 10:53 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM
Advertisement
Advertisement