న్యూఢిల్లీ: ఢిల్లీలో సంభవించిన తీవ్ర భూకంపంపై కేంద్ర పర్యాటక మంత్రి కపిల్ మిశ్రా స్పందించారు. తీవ్రం...తీవ్రం..ఇది చాలా భయంకరం.. అందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ ... ఆయన సోమవారమిక్కడ అన్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. మరోవైపు భూకంపంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్విట్ చేశారు.
అటు ఆఫ్ఘనిస్తాన్ హిందూ కుష్ భూ కంపం కేంద్రం కేంద్రీకృతమైనట్టు వాతారవణ అధికారులు ప్రకటించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో కూడా 8.1 తీవ్రతతో భూమి కంపించింది.