praying
-
శివరాత్రి పూజలో పాల్గొన్న పిచుక్క
-
ఆ శక్తి ఏమిటో గుర్తించాడు
రెక్కాడితేగాని డొక్కాడని ఒక కూలివాడు ఉండేవాడు. రాళ్లు కొట్టి రోళ్లను తయారు చేసే ఒక ఆసామి దగ్గర ఇతను రోజుకూలి చేస్తుండేవాడు. ఈ పని చేసి చేసి అతడికి విసుగెత్తింది. నా జీవితంలో మార్పు కావాలి అనుకున్నాడు. ఇందుకు తన శక్తి చాలదని ఏ శక్తో తోడు కావాలని తలచాడు. ఏదో ఒక శక్తిని ప్రసన్నం చేసుకుంటే తన జీవితం బాగు పడుతుందని భావించాడు. ఆ ఆలోచన వచ్చిందే తడువు అతను పర్వత శిఖరం మీదకు చేరుకున్నాడు. అక్కడ కొలువై ఉన్న దేవతను తన కోర్కెను తీర్చవలసిందిగా ప్రాధేయపడుతూ పదే పదే చేతులు జోడించసాగాడు. అయితే ఆమె ఎంతకూ బదులివ్వకపోవడంతో మరికాస్తా పెద్ద దేవతను ఆరాధిస్తే బాగుంటుందనుకున్నాడు. ఈ దేవత కన్నా పెద్ద దేవత ఎవరా అని ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తే సూర్యుడు కనిపించాడు. ప్రత్యక్షదైవం సూర్యుడే కాబట్టి సూర్యుణ్ణి ఆరాధిస్తే బాగుంటుందనుకున్నాడు. అంతే! సూర్యారాధన మొదలు పెట్టాడు. పొద్దుగూకులూ అదే ధ్యాస అతనికి. కొండమీది ఫలవృక్షాల నుంచి కొన్ని పండ్లు కోసుకు తిని ఆకలి తీర్చుకోవడం, అక్కడే ఉన్న నీటికుంటలో స్నానం చేయడం, సూర్యుణ్ణి ధ్యానం చేయడం, నిద్ర వస్తే ఏ చెట్టు కిందనో, కొండగుహలోనో పడుకోవడం.... ఇవే అతని నిత్యకృత్యాలు. సూర్యుడు ఏనాటికైనా కరుణిస్తే తన జీవితం మారిపోతుందని ఎదురు చూసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు సూర్యుణ్ణి మేఘాలు కప్పివేయడంతో సూర్యుడు కనిపించకుండా పోయాడు. దాంతో సూర్యుడి కంటే మేఘాలే గొప్పవనుకుని సూర్యారాధన మాని వేసి, మేఘాలను ప్రార్థించసాగాడు. కొద్దికాలంలోనే మేఘాలు పర్వతాలను ఢీకొని అక్కడే అంతమౌతున్నాయి కాబట్టి పర్వతాలే గొప్పవని తోచింది. అందువల్ల పర్వతాలను ప్రార్థించసాగాడు. ఈ క్రమంలో రోజూ తన పలుగు దెబ్బకే పర్వతాలు పగిలిపోతున్నాయి కాబట్టి తానే వాటి కంటే బలం గలవాడినన్న సంగతి స్ఫురణకొచ్చింది. వెంటనే అతని ఆలోచనా విధానం మారింది. అందరికన్నా తానే శక్తిమంతుడినని తోచి తన స్వశక్తినే నమ్ముకోవడం మొదలు పెట్టాడు. చూస్తుండగానే అతను ఎన్నో అద్భుతాలు చేయగలిగాడు. అందరికన్నా గొప్పవాడు కాగలిగాడు. మనిషి శక్తి అతనిలోనే ఉంటుంది. దానిని అతను తనంతట తానైనా గుర్తించగలగాలి లేదంటే ఇతరులెవరైనా గుర్తించి దానిని వెలికి తీయాలి. అప్పుడు అతను తనకు తానే సాటి అవుతాడు. - డి.వి.ఆర్. -
ప్రజాసంకల్పయాత్ర : హిందుపూరం ప్రజలు ప్రార్ధనలు
-
ప్రజాసంకల్పయాత్ర: ముస్లిం సోదరులు ప్రార్ధనలు
-
తీవ్రం..తీవ్రం.. భయంకరం
న్యూఢిల్లీ: ఢిల్లీలో సంభవించిన తీవ్ర భూకంపంపై కేంద్ర పర్యాటక మంత్రి కపిల్ మిశ్రా స్పందించారు. తీవ్రం...తీవ్రం..ఇది చాలా భయంకరం.. అందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ ... ఆయన సోమవారమిక్కడ అన్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. మరోవైపు భూకంపంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్విట్ చేశారు. అటు ఆఫ్ఘనిస్తాన్ హిందూ కుష్ భూ కంపం కేంద్రం కేంద్రీకృతమైనట్టు వాతారవణ అధికారులు ప్రకటించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో కూడా 8.1 తీవ్రతతో భూమి కంపించింది. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
జిల్లా వ్యాప్తంగా ముస్లింలు సోమవారం భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకున్నారు. అన్ని ఈద్గాలలో సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇరుగుపొరుగువారి సుఖసంతోషాల కోసం కృషిచేసేవారినే అల్లాహ్ అభిమానిస్తాడని మత పెద్దలు పేర్కొన్నారు. ప్రజలంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కడపలో పెద్ద దర్గా పీఠాధిపతి బక్రీద్ ప్రార్థనలు చేయించారు. కడప కల్చరల్ : బక్రీద్ పండుగ ద్వారా అల్లాహ్ అందించిన సందేశం మానవులందరికీ ఆచరణీయమని మత గురువు ముఫ్తీ మహమ్మద్ న్యాయమతుల్లా సాహెబ్ పేర్కొన్నారు. బక్రీద్పండుగను పురస్కరించుకుని సోమవారం కడప నగరం బిల్టప్ ఈద్గాలో ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ న్యాయమతుల్లా పండుగ బయాన్ ఇచ్చారు. హజరత్ ఇబ్రహీం, ఆయన కుమారుడు ఇస్మాయిల్ అల్లాహ్ పెట్టిన పరీక్షలో నెగ్గిన విధానాన్ని ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. వారి త్యాగాలు మానవాళికి ఆదర్శమన్నారు. బక్రీద్ ప్రార్థనలు నిర్వహించవలసిన పద్ధతులను వివరించారు. ఈ పండుగ సందర్బంగా ఇచ్చే ఖుర్చానీని దైవం పేరిట ఇవ్వాలన్నారు. ఇరుగు పొరుగు సుఖ సంతోషాల కోసం కృషి చేసే వారినే అల్లాహ్ అభిమానిస్తాడని, ప్రజలంతా ఆనందంగా కలిసిమెలిసి ఉండాలన్నారు. అనంతరం పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ హాజరైన భక్తులతో బక్రీద్ ప్రార్థనలు చేయించారు. ఈ సందర్బంగా ఆయన ఆశీస్సుల కోసం ప్రజలు ఆరాటపడ్డారు. పలువురు ముస్లిం ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు పొందారు. ప్రజలు ఒకరినొకరు హత్తుకుని సాంప్రదాయబద్దంగా ‘ఈద్ ముబారక్ హో’ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రార్థనలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈద్గా అంతటా షామియానాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెద్దదర్గా ప్రతినిధులు నయీమ్, అమీర్, బైజు, మున్నా, మాజీమంత్రి అహ్మదుల్లా, ఆయన కుమారుడు అస్రఫ్, నగర ప్రముఖులు అమీర్‌బాబు, సుభాన్‌బాష, నజీర్ అహ్మద్, దుర్గాప్రసాద్, సీఆర్ఐ సుబ్బారెడ్డి, ఎన్ఆర్ఐ తోట కృష్ణ, మగ్బూల్‌బాష తదితరులు పాల్గొన్నారు. -
ఆరిన దీపం?
తిరిగి రాని లోకాలకు తిమ్మన్న బోరు బావి నుంచి దుర్వాసన మృతదేహం వెలికితీతకు సాగుతున్న పనులు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : మంత్రి పాటిల్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రార్థనలు ఫలించలేదు. దేవుడు కరుణించలేదు. అతని ఆయుష్షు అంతేనని తేల్చేశాడు. బాగలకోటె జిల్లా సూళికేరి వద్ద గత ఆదివారం బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల తిమ్మన్న అటు నుంచి అటే...తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ప్రాణాలతో అతనిని బయటకు తీసుకు రావడానికి చేపట్టిన సహాయక చర్యలు...ఇప్పుడు మృతదేహాన్ని వెలికి తీయడానికి కొనసాగుతున్నాయి. మధ్య మధ్యలో అవాంతరాలతో 88 గంటల పాటు ఏకబిగిన సహాయక చర్యలు సాగాయి. ‘బాలుడు బోరు బావిలో పడిపోయి ఎనభై గంటలకు పైగా గడిచిపోయాయి. కనుక అతను చనిపోయి ఉండవచ్చు. బోరు బావి నుంచి దుర్వాసన వస్తోంది’ అని జిల్లా సర్జన్ అనంత రెడ్డి బుధవారం రాత్రి బాగా పొద్దు పోయాక సంఘటనా స్థలం వద్ద ప్రకటించారు. అంతే...చాలా సేపు అక్కడ అయోమయం నెలకొంది. రోబో ద్వారా బాలుని వెలికి తీయడానికి మధురై నుంచి వచ్చిన మణికంఠన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వర్షం కొద్దిగా తగ్గిన తర్వాత వైదుృల బందం అక్కడికి చేరుకుంది. బోరు బావి నుంచి కుళ్లిన వాసన వస్తుండడంతో బాలుడు బతికి ఉండడృని బందం నిర్ధారించింది. శోక సంద్రంలో కుటుంబం తిమ్మన్న మరణించి ఉంటాడని వైద్యులు తేల్చడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు బిడ్డను పోగొట్టుకుని, అటు భర్త ఆస్పత్రి పాలవడాన్ని తలుచుకుని తిమ్మన్న తల్లి సంగవ్వ బోరున విలపించింది. నాలుగు రోజులుగా ఆమె నిద్రాహారాలు మానుకుని బిడ్డ కోసం విలపిస్తూ కూర్చుంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. తీవ్ర అస్వస్థతకు లోనైన తిమ్మన్న తండ్రి హనుమంతప్ప ఆస్పత్రిలో కోలుకుంటున్న సంగతి తెలిసిందే. మృతదేహం వెలికితీతకు ప్రయత్నాలు తిమ్మన్న మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రోబో ద్వారా వెలికి తీయాలంటే ముందుగా బోరు బావిలో పడిన మట్టిని తొలగించాల్సి ఉంది. శవంపై ఒకటిన్నర అడుగుల మట్టి ఉండవచ్చని అంచనా. రెండు వాక్యూమ్ సక్కర్ల ద్వారా మట్టిని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మట్టిని తొలగిస్తేనే రోబో ద్వారా మృతదేహాన్ని వెలికి తీయడం సాధ్యమవుతుంది. సమాంతరంగా తవ్వుతున్న సొరంగ మార్గం ద్వారా బయటకు తీయాలంటే మరో రెండు రోజులు పట్టే అవకాశాలున్నాయి. హనుమంతప్పను ఆదుకుంటాం తిమ్మన్నను వెలికి తీయడానికి చేసిన ప్రయత్నాల్లో అతని తండ్రికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని పంచాయతీ రాజ్, గ్రామీణృభివద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ తెలిపారు. గురువారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పొలంలో తవ్విన సొరంగ మార్గాలను ప్రభుత్వమే పూడ్చి వేస్తుందని చెప్పారు. కాగా తిమ్మన్న కుటుంబానికి ప్రభుత్వం ఇదివరకే రూ.2 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. స్థానిక ఎమ్మెల్యేలు తలా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.