
ఉత్తర ఇటలీలోని మిలన్‌లో గురువారం ఓ వీధిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అనేక వాహానాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లను రవాణా చేస్తున్న వ్యాన్‌లో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్లు పక్కల ఉన్న కార్లకు సైతం మంటలు వ్యాపించాయి.
దీంతో అక్కడ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఐతే సంఘటనా స్థలంలోనే పాఠశాల, నర్సింగ్ హోం ఉండటంతో..అందులో ఉన్న వారిని ఖాళీ చేయించారు అధికారులు. ఐతే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి త్వరితగతిన మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు అధికారులు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవ్వుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment