గొల్లపాలెంలో భారీ పేలుడు | massive explosion gollapalem | Sakshi
Sakshi News home page

గొల్లపాలెంలో భారీ పేలుడు

Apr 9 2017 11:07 PM | Updated on Sep 5 2017 8:22 AM

గొల్లపాలెంలో భారీ పేలుడు

గొల్లపాలెంలో భారీ పేలుడు

గొల్లపాలెం(మలికిపురం) : గొల్లపాలెం గ్రామంలోని ఓఎన్జీసీ జీసీఎస్‌ సమీపంలో గ్యాస్‌ కంట్రోల్‌ పాయింట్‌లో ఆదివారం గ్యాస్‌ లీకైంది. భారీ శబ్ధంతో తొలుత పేలుడు సంభవించడంతో స్థానికంగా నివాసాలు ఉంటున్న ప్రజలు బెంబేలెత్తారు. పేలుడుతో పాటు గ్యాస్‌ లీకైంది. సుమారు అర గంట పాటు గ్యాస్‌ లీకైందని స్థానికులు తెలిపారు. జీసీఎస్‌ నుంచి ప్రత్యేక పైప్‌లై¯ŒS ద్వారా ఈ కంట్రోల్‌ పాయింట్‌కు గ్యాస్‌ క్రూ

కంట్రోల్‌ పాయింట్‌లో గ్యాస్‌ లీకు
ఆందోళనలో గొల్లపాలెం వాసులు
గొల్లపాలెం(మలికిపురం) : గొల్లపాలెం గ్రామంలోని ఓఎన్జీసీ జీసీఎస్‌ సమీపంలో గ్యాస్‌ కంట్రోల్‌ పాయింట్‌లో ఆదివారం గ్యాస్‌ లీకైంది. భారీ శబ్ధంతో తొలుత పేలుడు సంభవించడంతో స్థానికంగా నివాసాలు ఉంటున్న ప్రజలు బెంబేలెత్తారు. పేలుడుతో పాటు గ్యాస్‌ లీకైంది. సుమారు అర గంట పాటు గ్యాస్‌ లీకైందని స్థానికులు తెలిపారు. జీసీఎస్‌ నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా ఈ కంట్రోల్‌ పాయింట్‌కు గ్యాస్‌ క్రూడాయిల్‌ వస్తోంది. అక్కడి నుంచి నగరం జీసీఎస్‌కు వెళుతోంది. పేలుడుతో జీసీఎస్‌లో గ్యాస్‌సరఫరా నిలిపి వేశారు. పేలుడు సంభవించిన చోట గ్యాస్‌ అదుపులోకి వచ్చింది. సాయంత్రం వరకూ గెయిల్‌ ఉన్నతాధికారులు ఎవరూ ఇక్కడకు రాలేదు. పేలుడుకు కారణాలు తెలియలేదు. మరమ్మతులు కూడా 
చేయాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement