Stripe workers
-
నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!
న్యూఢిల్లీ: ఇండియాలో పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు అంతగా పాపులర్ కాలేదు. చాలావరకు నామమాత్రపు చెల్లింపులే ఉంటాయి. చెప్పాలంటే ఒక్కోసారి ఇంటర్న్లే కంపెనీకి తిరిగి చెల్లించాల్సి అవసరం కూడా ఉంది. కానీ అదృష్టవశాత్తూ ప్రతీచోటా ఇలాంటి పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక సాంకేతిక సంస్థలు ఇంటర్న్‌కి ఒక సగటు భారతీయ ఉద్యోగి జీతం కంటే మంచి వేతనాన్ని అందిస్తాయి. ముఖ్యంగా దేశీయ టెక్ దిగ్గజాల సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లకు లభించే వేతనం కంటే ఎక్కువ చెల్లించే కంపెనీలున్నాయి. కంపెనీలను సమీక్షించే ప్లాట్‌ఫారమ్ గ్లాస్‌డోర్ అత్యధిక చెల్లింపు ఇంటర్న్షిప్స్ ఇచ్చే టాప్ 25 సంస్థల జాబితాను సిద్ధం చేసింది. విద్యార్థులు, కొత్త గ్రాడ్యుయేట్లకు, ఇంటర్న్‌లకు టాప్ డాలర్‌ను చెల్లించే కంపెనీలను గుర్తించడంలో సహాయపడటానికి అత్యధికంగా చెల్లించే 25 కంపెనీలకు గ్లాస్‌డోర్ ఈ ర్యాంకులు ఇచ్చింది. ముఖ్యంగా గ్లోబల్‌గా అనేక టెక్, ఇతర కంపెనీల్లో లేఆఫ్‌లు ఆందోళన రేపుతున్న తరుణంలో ఇంటర్న్‌షిప్ ద్వారా అడుగుపెట్టాలని ఆశించే వారికిఇది ఊరటనిస్తుందని కంపెనీ తెలిపింది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) గ్లాస్‌డోర్ నివేదిక ప్రకారం, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డిజిటల్ చెల్లింపుల సంస్థ స్ట్రైప్ ఈ జాబితాలో టాప్‌లో నిలిచింది. ఇంటర్న్‌కు నెలవారీ రూ. 7.40 లక్షల (9,064 డాలర్లు ) స్టైఫండ్‌ను ఆఫర్ చేసింది. అంటే ఒక ఇంటర్న్ ఏడాదికి రూ. 81 లక్షల కంటే ఎక్కువ సంపాదించగలడు. మెటా, స్నాప్, టిక్‌టాక్ వంటి సామాజిక దిగ్గజాల నుండి స్ట్రైప్, కాయిన్‌బేస్ వంటి ఫిన్‌టెక్ కంపెనీల వరకు, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాల దాకా ఈ జాబితాలో 16 టెక్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇంకా సిటీ, క్యాపిటల్ వన్ వంటి ఐదు ఫైనాన్స్ కంపెనీలు, బెయిన్ అండ్ కంపెనీ, మెకిన్సే సహా మూడు కన్సల్టింగ్ సంస్థలు, ఏకైక సంస్థ ఆటో కంపెనీ రివియన్ ఉండటం విశేషం. (వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్!) -
తాటిచెట్లు ఎక్కేందుకు యంత్రాలు
త్వరలో గీత కార్మికులకు అందజేస్తాం: మంత్రి పద్మారావు హైదరాబాద్: తాటిచెట్లు ఎక్కడానికి వీలుగా గీత కార్మికులకు యంత్రాలు అందజేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు వెల్లడించారు.సికిం ద్రాబాద్ బోయిగూడలోని కల్లు కాంపౌండ్‌లో శని వారం అధికారులతో కలసి తనిఖీ చేశారు. అనం తరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ సమైక్య పాలకులు కల్లు కాంపౌండ్లను మూసివేసి గౌడ కులస్తుల పొట్టగొట్టారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ వాటిని తెరి పించి ఎంతో మందికి ఉపాధి కల్పించారని పేర్కొ న్నారు. కల్లు కాంపౌండ్లలో కల్తీ జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన కార్య క్రమాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో గీత కార్మికులకు త్వరలో గుర్తింపుకార్డులు అందజేస్తా మన్నారు. కార్యక్రమంలో ఆ శాఖ ముఖ్య కార్య దర్శి సోమేశ్‌కుమార్, డైరెక్టర్ అకున్ సబర్వాల్, ప్రముఖ శాస్త్రవేత బిక్షపతి పాల్గొన్నారు. కల్లు విక్రయాలను పరిశీలించిన మంత్రి బోయిగూడ కల్లు కాంపౌండ్‌లో కల్లు నిల్వలు, విక్రయాలు వంటి వాటిపై మంత్రి పద్మారావు ఆరా తీశారు. రోజు వారీగా చెట్ల నుంచి కల్లు వస్తోందా.. వాటిని ఎలా నిల్వ చేస్తున్నారు.. కల్లు భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. రోజువారీగా మిగిలిన కల్లును ఏమీ చేస్తున్నారని కల్లుకంపౌండ్ నిర్వాహకులను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత భిక్షపతి తాటికల్లు తెప్పించుకొని రుచి చూసి బాగుందని కితాబిచ్చారు. -
పని చేయించుకొని డబ్బులివ్వరా..?
మునిపల్లి: తమతో పని చేయించుకుని డబ్బులివ్వమంటే ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని గీత కార్మికులు మునింలను నిలదీశారు. ఆదివారం మండలంలోని తాటిపల్లి గ్రామ శివారులోని వనంలో గీత కార్మికులు తమకు వెంటనే వేతనాలు ఇవ్వాలని మునీంలను డిమాండ్ చేశారు. 115 రోజులుగా ఇక్కడే పని చేస్తున్నాం.. ఇప్పటి వరకు తమకు సుమారు 3000 రూపాయల చొప్పున 33 మందికి అడ్వాన్సు ఇచ్చినట్లు గీత కార్మికులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయల్‌కొండ మండలం చంద్రాస్‌పల్లి గ్రామం నుంచి ఐదుగురు, మదూర్ మండలం బొమ్మూరు నుంచి 12 మంది, బొనిడు గ్రామం నుంచి ఏడుగురు, అనాజిపూరం నుంచి ఇద్దరిని మునింలు కృష్ణయ్య, వెంకన్న తీసుకవచ్చారన్నారు. కల్లు కాంట్రాక్టర్ దగ్గర గీత కార్మికులుగా పని చేస్తే మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామంలోని ఈత వనంలో కల్లు గీస్తే రూ.9100లు ఇప్పిస్తానని ఇద్దరు మునింలు తమను తెచ్చినట్లు గీత కార్మికులు తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నుంచి 8 మందితో పాటు మునిపల్లి మండలం తాటిపల్లిలో ముగ్గురు, పిల్లోడి, బొడపల్లి, మన్సాన్పల్లి నుంచి ఒక్కొక్కరి చొప్పున మొత్తం 33 మందితో సుమారు 1600 ఇతచెట్ల నుంచి కల్లు గీయించినట్లు తెలిపారు. తాము ఇక్కడకు వచ్చి మూడు నెలల 15 రోజులవుతున్నా వేతనం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. తమ యూనియన్ గీత కార్మికులకు రూ. 8,100 చొప్పున చెల్లించాలని చెబితే కాంట్రాక్టర్ రూ.9.100లకు బదులు రూ.6.100 ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బొమ్మూరు గ్రామానికి చెందిన అంజయ్య నాలుగు రోజులుగా చలి జ్వరంతో బాధపడుతున్నారని, వైద్యం చేయిద్దామంటే తమ వద్ద డబ్బులు లేవని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే ఇత వనంలో కల్లు గీయడానికి వచ్చిన ఓ కార్మికుడు వనంలోనే శవమై తేలాడాన్నారు. తమ వద్ద కనీసం ఇంటికి వెళ్లడానికి కూడా బస్సు చార్జీలు లేవని, చాలీ చాలీ భోజనం తింటున్నామని గీత కార్మికులు మునింలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల క్రితం కల్లు తీసుకపోవడానికి డీసీఎం వస్తే తమ వేతనాలు ఇచ్చేంత వరకు డీసీఎంను కదలినిచ్చేది లేదని గీత కార్మికులు వాహనాన్ని అడ్డుకోవడంతో గ్రామస్తులు ఇరువురిని శాంతింపజేశారు. 3 నెలల 15 రోజుల నుంచి భార్యా పిల్లలకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి పంపలేదని, డబ్బులు లేకుండా ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చిక్కడపల్లికి చెందిన కల్లు కాంట్రాక్టర్ తమకు వేతనాలు చెల్లించకుండా చేస్తున్నారని, అందువల్లనే కల్లుకోసం వచ్చిన డీసీఎంను అడ్డుకున్నామన్నారు.