తాటిచెట్లు ఎక్కేందుకు యంత్రాలు
త్వరలో గీత కార్మికులకు అందజేస్తాం: మంత్రి పద్మారావు
హైదరాబాద్: తాటిచెట్లు ఎక్కడానికి వీలుగా గీత కార్మికులకు యంత్రాలు అందజేయనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు వెల్లడించారు.సికిం ద్రాబాద్ బోయిగూడలోని కల్లు కాంపౌండ్‌లో శని వారం అధికారులతో కలసి తనిఖీ చేశారు. అనం తరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ సమైక్య పాలకులు కల్లు కాంపౌండ్‌లను మూసివేసి గౌడ కులస్తుల పొట్టగొట్టారన్నారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ వాటిని తెరి పించి ఎంతో మందికి ఉపాధి కల్పించారని పేర్కొ న్నారు. కల్లు కాంపౌండ్లలో కల్తీ జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన కార్య క్రమాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో గీత కార్మికులకు త్వరలో గుర్తింపుకార్డులు అందజేస్తా మన్నారు. కార్యక్రమంలో ఆ శాఖ ముఖ్య కార్య దర్శి సోమేశ్‌కుమార్, డైరెక్టర్ అకున్ సబర్వాల్, ప్రముఖ శాస్త్రవేత బిక్షపతి పాల్గొన్నారు.
కల్లు విక్రయాలను పరిశీలించిన మంత్రి
బోయిగూడ కల్లు కాంపౌండ్‌లో కల్లు నిల్వలు, విక్రయాలు వంటి వాటిపై మంత్రి పద్మారావు ఆరా తీశారు. రోజు వారీగా చెట్ల నుంచి కల్లు వస్తోందా.. వాటిని ఎలా నిల్వ చేస్తున్నారు.. కల్లు భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. రోజువారీగా మిగిలిన కల్లును ఏమీ చేస్తున్నారని కల్లుకంపౌండ్ నిర్వాహకులను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత భిక్షపతి తాటికల్లు తెప్పించుకొని రుచి చూసి బాగుందని కితాబిచ్చారు.