
రాంగోపాల్‌పేట్: నటి లావణ్య త్రిపాఠి చీరకట్టులో మెరిసి పోయింది. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచిపురం కామాక్షి సిల్క్స్ షోరూమ్‌ను మంత్రి పద్మారావు దంపతులతో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. ఆమెను చూసేందుకుఅభిమానులు తరలొచ్చారు. కస్టమర్లఅభిరుచికి అనుగుణంగానాణ్యమైన సేవలందిస్తూదినదినాభివృద్ధిసాధించాలని లావణ్య, మంత్రి ఆకాంక్షించారు. రూ.295 నుంచిరూ.3 లక్షల వరకు చీరలు అందుబాటులో ఉన్నాయని సంస్థ యజమాని వీ.రాజేందర్‌కుమార్ తెలిపారు.