Glassdoor
-
నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!
న్యూఢిల్లీ: ఇండియాలో పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు అంతగా పాపులర్ కాలేదు. చాలావరకు నామమాత్రపు చెల్లింపులే ఉంటాయి. చెప్పాలంటే ఒక్కోసారి ఇంటర్న్లే కంపెనీకి తిరిగి చెల్లించాల్సి అవసరం కూడా ఉంది. కానీ అదృష్టవశాత్తూ ప్రతీచోటా ఇలాంటి పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక సాంకేతిక సంస్థలు ఇంటర్న్‌కి ఒక సగటు భారతీయ ఉద్యోగి జీతం కంటే మంచి వేతనాన్ని అందిస్తాయి. ముఖ్యంగా దేశీయ టెక్ దిగ్గజాల సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లకు లభించే వేతనం కంటే ఎక్కువ చెల్లించే కంపెనీలున్నాయి. కంపెనీలను సమీక్షించే ప్లాట్‌ఫారమ్ గ్లాస్‌డోర్ అత్యధిక చెల్లింపు ఇంటర్న్షిప్స్ ఇచ్చే టాప్ 25 సంస్థల జాబితాను సిద్ధం చేసింది. విద్యార్థులు, కొత్త గ్రాడ్యుయేట్లకు, ఇంటర్న్‌లకు టాప్ డాలర్‌ను చెల్లించే కంపెనీలను గుర్తించడంలో సహాయపడటానికి అత్యధికంగా చెల్లించే 25 కంపెనీలకు గ్లాస్‌డోర్ ఈ ర్యాంకులు ఇచ్చింది. ముఖ్యంగా గ్లోబల్‌గా అనేక టెక్, ఇతర కంపెనీల్లో లేఆఫ్‌లు ఆందోళన రేపుతున్న తరుణంలో ఇంటర్న్‌షిప్ ద్వారా అడుగుపెట్టాలని ఆశించే వారికిఇది ఊరటనిస్తుందని కంపెనీ తెలిపింది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) గ్లాస్‌డోర్ నివేదిక ప్రకారం, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డిజిటల్ చెల్లింపుల సంస్థ స్ట్రైప్ ఈ జాబితాలో టాప్‌లో నిలిచింది. ఇంటర్న్‌కు నెలవారీ రూ. 7.40 లక్షల (9,064 డాలర్లు ) స్టైఫండ్‌ను ఆఫర్ చేసింది. అంటే ఒక ఇంటర్న్ ఏడాదికి రూ. 81 లక్షల కంటే ఎక్కువ సంపాదించగలడు. మెటా, స్నాప్, టిక్‌టాక్ వంటి సామాజిక దిగ్గజాల నుండి స్ట్రైప్, కాయిన్‌బేస్ వంటి ఫిన్‌టెక్ కంపెనీల వరకు, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాల దాకా ఈ జాబితాలో 16 టెక్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇంకా సిటీ, క్యాపిటల్ వన్ వంటి ఐదు ఫైనాన్స్ కంపెనీలు, బెయిన్ అండ్ కంపెనీ, మెకిన్సే సహా మూడు కన్సల్టింగ్ సంస్థలు, ఏకైక సంస్థ ఆటో కంపెనీ రివియన్ ఉండటం విశేషం. (వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్!) -
వేతనాల్లో బెస్ట్ జాబ్స్ ఇవేనట!
కొత్తగా ఉద్యోగంలో చేరబోతున్న ఉద్యోగులు, యువత ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేది వేతనానికే. శాలరీ బాగుంటే చాలు ఎంత కష్టపడైనా ఆ కంపెనీలో జాబ్ కొట్టేయడానికి అలుపులేకుండా శ్రమిస్తారు. అయితే వేతనాల్లో బెస్ట్ జాబ్స్ ఏమిటో తెలుసా? హెల్త్ కేర్, టెక్నాలజీ, లా కు సంబంధించిన ఉద్యోగాలు అమెరికాలో బెస్ట్ జాబ్స్ గా పేరొందుతున్నాయట. ఫిజిషియన్స్ అత్యధిక సగటు మూల వేతనం ఆర్జిస్తున్నారని వెల్లడైంది. వీరికి 1,87,876 డాలర్ల వరకు అంటే మన కరెన్సీలో 1,22,29,882 వరకు వేతనం ఉండొచ్చని కెరీర్ వెబ్ సైట్ గ్లాస్‌డోర్ ఇంక్ తాజా రిపోర్టు వెల్లడించింది. రెండో అత్యధిక వేతనం అందుకునేది ఫార్మసీ మేనేజర్లేనని ఈ రిపోర్టు పేర్కొంది. వీరికి ఫార్మాస్యూటికల్ డిగ్రీతో పాటు మేనేజ్మెంట్ అనుభవముంటే వేతనాలు బాగుంటాయని పేర్కొంది. పేటెంట్ అటార్నిలు కూడా అత్యధిక వేతనాలు సంపాదిస్తున్నారని తెలిపింది. గ్లాస్ డోర్ రూపొందించిన 25 బెస్ట్ పేయింగ్ జాబ్స్ లో 11 టెక్ పరిశ్రమకు సంబంధించినవే ఉన్నాయి. సిలికాన్ వ్యాలీ ఉద్యోగులకు చెల్లించే వేతనం మంచిగా చెల్లిస్తుందని రిపోర్టు నివేదించింది. నగదు, స్టాక్ బోనస్‌లతో వీరి వేతనాలు ఉంటాయని పేర్కొంది. ఈ రిపోర్టులో 25 బెస్ట్ పేయింగ్ జాబ్స్ గా ఫిజిషియన్, ఫార్మసీ మేనేజర్, పేటెంట్ అటార్ని, మెడికల్ సైన్స్ లియాసన్, ఫార్మసిస్ట్, ఎంటర్ప్రైజ్ అర్కిటెక్, ఫిజిషియన్ అసిస్టెంట్, యాప్ డెవలప్మెంట్ మేనేజర్, ఆర్ అండ్ డీ మేనేజర్, కార్పొరేట్ కంట్రోలర్, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ మేనేజర్, ఐటీ ఆర్కిటెక్, సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్, నర్స్ ప్రాక్టీషినర్, సొల్యుషన్స్ అర్కిటెక్, డేటా ఆర్కిటెక్, ఐటీ ప్రొగ్రామ్ మేనేజర్, యూఎక్స్ మేనేజర్, సిస్టమ్స్ ఆర్కిటెక్, ప్లాంట్ మేనేజర్, ఫైనాన్సియల్ ప్లానింగ్ మేనేజర్, న్యూక్లియర్ ఇంజనీర్, అటార్నిలు చోటు దక్కించుకున్నాయి. అయితే న్యూక్లియర్ ఇంజనీర్, అటార్నిలో కేవలం 155 జాబ్ ఓపెనింగ్స్ మాత్రమే ఉన్నాయని, ఫిజిషియన్ అసిసెంట్లో ఎక్కువగా 13,500 వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని గ్లాస్ డోర్ తెలిపింది. -
ఈ కంపెనీలైతే బాగుంటాయి
ఓ సంస్థ నుంచి మరో సంస్థకు మారాలన్నా, కొత్తగా ఏదైనా సంస్థలో ఉద్యోగంలో చేరాలన్నా సామర్థ్యానికి తగ్గా పనితో పాటూ మంచి సంస్థల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అయితే కేవలం పని, జీతం మాత్రమే కాకుండా ఉద్యోగులకు ఇచ్చే మరిన్ని సదుపాయాలను ఆధారంగా చేసుకొని సంస్థల ర్యాంకులను బేరీజు వేసే గ్లాస్డూర్ ఈ ఏడాదికిగానూ బెస్ట్ ప్లేసెస్ టు వర్క్ పేరుతో టాప్ సంస్థల వివరాలను విడుదల చేసింది. పని చేయడానికి అత్యంత అనువైన టాప్ కంపెనీల జాబితాను గ్లాస్డూర్ వెబ్ సైట్ వెల్లడించింది. ఆన్లైన్ సర్వేలో పాల్గొన్న గ్లాస్డూర్ సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపారు. అమెరికా: అమెరికాలో టాప్ స్థానంలో బెయిన్ & కంపెనీ నిలిచింది. 2009 నుంచి టాప్5 జాబితాలో ఈ సంస్థ చోటు సంపాదిస్తూనే ఉంది. వృత్తిపరమైన అభివృద్ధి, మంచి పని తీరు, ఉద్యోగులకు ఉత్తమ ప్రయోజనాలను అందించడం ద్వారా తొలి స్థానంలో నిలిచింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ రెండో స్థానంలో నిలిచింది. ఉద్యోగులకు ఉచిత ఆహారం అందించడంతో పాటూ పని చేయడానికి కావాల్సిన మంచి వాతావరణం ఫేస్ బుక్ కార్యాలయం అందిస్తుంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు మూడో స్థానం దక్కింది. తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే విధంగా మేనేజ్ మెంట్ ప్రణాళికలు ఉంటాయి. గూగుల్ ఉద్యోగులకు కల్పిస్తున్న ప్రయోజనాలు, ఒత్తిడి లేని పని వాతావరణం నాలుగో స్థానంలో నిలిపాయి. సంస్థలో పనిని, ఉద్యోగి జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నతమైన ప్రమాణాలతో నిర్వహిస్తున్న వరల్డ్ వైడ్ టెక్నాలజీ ఐదో స్థానంలో నిలిచింది. యూనైటెడ్ కింగ్డమ్: ట్రావెల్ పోర్టల్ ఎక్స్పీడియా తొలి స్థానంలో నిలిచింది. ఉద్యోగులకు కల్పిస్తున్న ప్రయోజనాలతో పాటూ ముఖ్యంగా ఉద్యోగులకు విహారయాత్రలకు కూడా బోలెడన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఏఆర్ఎం హోల్డింగ్స్, రెండో స్థానంలో నిలిచింది. 2016లో జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు ఈ సంస్థని చేజిక్కించుకుంది. ఉద్యోగులకు అనువుగా వర్కింగ్ పాలసీలు, పనితో పాటూ పర్సనల్ లైఫ్‌కు కూడా ఎక్కువ సమయం కేటాయించే వెసులుబాటుతో ఉద్యోగులకు మంచి పనివాతావరణాన్ని కల్పించింది. హోమ్ ఎమర్జెన్సీ రిపేర్ సర్వీసెస్(హోం సర్వ్) మూడో స్థానంలో నిలిచింది. కస్టమర్లకు ఉన్నత ప్రమాణాలతో సేవలందించేలా ఉద్యోగులు కలిసి కట్టుగా పని చేయడంలో సీనియర్ మేనేజ్ మెంట్ పనితీరు అద్భుతం. ఇంజినీరింగ్ కంపెనీ మోట్ మెక్ డోనాల్డ్ నాలుగో స్థానంలో నిలిచింది. గ్లొబల్ వర్క్ ఎన్విరాన్‌మెంట్‌తో ఉద్యోగులకు ప్రొత్సాహకాలు ఆఫర్ చేస్తోంది. రిక్రూట్మెంట్ ఎక్స్పర్ట్ హెయ్స్ ఐదో స్థానంలో నిలిచింది. వర్క్ హార్డ్, ప్లే హర్డ్ సంస్కృతితో ఉద్యోగులు జట్టుగా పని చేసేలా అవకాశం కల్పిస్తుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తుంది. జర్మనీ జర్మనీకి చెందిన సాఫ్ట్ వేర్ సంస్థ సాప్(ఎస్ఏపీ) తొలిస్థానంలో నిలిచింది. ఉద్యోగులకు తగిన జీతాలు, బెనిఫిట్స్, మంచి వాతావరణం కల్పిస్తోంది .జర్మనీకే చెందిన మరో సంస్థ ఆడిడాస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. స్కోర్ట్స్కు సంబంధించి ప్రోడక్ట్లను తయారు చేసే ఈ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉద్యోగులకు అన్ని సదుపాయాలను కల్పింస్తోంది. ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌కు చెందిన రాబర్ట్ బోస్క్ మూడో స్థానంలో నిలిచింది. రాబర్ట్ బోస్క్కి ఆటోమేటివ్ కంపోనెంట్స్ తయారీలో జర్మనీలోనే అగ్రసంస్థగా పేరుంది. ఉద్యోగులకు కార్పోరేట్ సదుపాయాలతో పాటూ ప్లెక్సిబుల్ వర్కింగ్ పాలసీలను రూపొందించింది. మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నాలుగు, ఆక్సెంచర్ ఐదో స్థానంలో నిలిచాయి. కెనడా ఈ కామర్స్ దిగ్గజం షాప్ఫీ కెనడాలో తొలిస్థానంలో నిలిచింది. సాఫ్ట్వేర్ కంపెనీ సెరిడియన్, రెండో స్థానంలో, ఫైనాన్సియల్ సర్వీస్ ప్రొవైడ్ ఏటీబీ ఫైనాన్షియల్ మూడో స్థానం కైవసం చేసుకున్నాయి. సేల్స్‌ఫోర్స్, సిస్కో సిస్టమ్స్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఫ్రాన్స్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తొలి స్థానంలో నిలిచింది. అత్యత్భుతమైన కేరీర్ డెవలప్మెంట్ అవకాశాలను మైక్రో సాఫ్ట్ తమ ఉద్యోగులకు కల్పిస్తోంది. రెండో స్థానంలో లెరోయ్ మెర్లిన్, మూడో స్థానంలో డెకాత్లోన్ నిలిచాయి. నాలుగో స్థానంలో ఎయిర్ బస్ గ్రూప్, ఐదో స్థానంలో టోటల్ కైవసం చేసుకున్నాయి.