వేతనాల్లో బెస్ట్ జాబ్స్ ఇవేనట!
వేతనాల్లో బెస్ట్ జాబ్స్ ఇవేనట!
Published Mon, Mar 27 2017 4:58 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
కొత్తగా ఉద్యోగంలో చేరబోతున్న ఉద్యోగులు, యువత ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేది వేతనానికే. శాలరీ బాగుంటే చాలు ఎంత కష్టపడైనా ఆ కంపెనీలో జాబ్ కొట్టేయడానికి అలుపులేకుండా శ్రమిస్తారు. అయితే వేతనాల్లో బెస్ట్ జాబ్స్ ఏమిటో తెలుసా? హెల్త్ కేర్, టెక్నాలజీ, లా కు సంబంధించిన ఉద్యోగాలు అమెరికాలో బెస్ట్ జాబ్స్ గా పేరొందుతున్నాయట. ఫిజిషియన్స్ అత్యధిక సగటు మూల వేతనం ఆర్జిస్తున్నారని వెల్లడైంది. వీరికి 1,87,876 డాలర్ల వరకు అంటే మన కరెన్సీలో 1,22,29,882 వరకు వేతనం ఉండొచ్చని కెరీర్ వెబ్ సైట్ గ్లాస్డోర్ ఇంక్ తాజా రిపోర్టు వెల్లడించింది. రెండో అత్యధిక వేతనం అందుకునేది ఫార్మసీ మేనేజర్లేనని ఈ రిపోర్టు పేర్కొంది.
వీరికి ఫార్మాస్యూటికల్ డిగ్రీతో పాటు మేనేజ్మెంట్ అనుభవముంటే వేతనాలు బాగుంటాయని పేర్కొంది. పేటెంట్ అటార్నిలు కూడా అత్యధిక వేతనాలు సంపాదిస్తున్నారని తెలిపింది. గ్లాస్ డోర్ రూపొందించిన 25 బెస్ట్ పేయింగ్ జాబ్స్ లో 11 టెక్ పరిశ్రమకు సంబంధించినవే ఉన్నాయి. సిలికాన్ వ్యాలీ ఉద్యోగులకు చెల్లించే వేతనం మంచిగా చెల్లిస్తుందని రిపోర్టు నివేదించింది. నగదు, స్టాక్ బోనస్లతో వీరి వేతనాలు ఉంటాయని పేర్కొంది.
ఈ రిపోర్టులో 25 బెస్ట్ పేయింగ్ జాబ్స్ గా ఫిజిషియన్, ఫార్మసీ మేనేజర్, పేటెంట్ అటార్ని, మెడికల్ సైన్స్ లియాసన్, ఫార్మసిస్ట్, ఎంటర్ప్రైజ్ అర్కిటెక్, ఫిజిషియన్ అసిస్టెంట్, యాప్ డెవలప్మెంట్ మేనేజర్, ఆర్ అండ్ డీ మేనేజర్, కార్పొరేట్ కంట్రోలర్, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ మేనేజర్, ఐటీ ఆర్కిటెక్, సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్, నర్స్ ప్రాక్టీషినర్, సొల్యుషన్స్ అర్కిటెక్, డేటా ఆర్కిటెక్, ఐటీ ప్రొగ్రామ్ మేనేజర్, యూఎక్స్ మేనేజర్, సిస్టమ్స్ ఆర్కిటెక్, ప్లాంట్ మేనేజర్, ఫైనాన్సియల్ ప్లానింగ్ మేనేజర్, న్యూక్లియర్ ఇంజనీర్, అటార్నిలు చోటు దక్కించుకున్నాయి. అయితే న్యూక్లియర్ ఇంజనీర్, అటార్నిలో కేవలం 155 జాబ్ ఓపెనింగ్స్ మాత్రమే ఉన్నాయని, ఫిజిషియన్ అసిసెంట్లో ఎక్కువగా 13,500 వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని గ్లాస్ డోర్ తెలిపింది.
Advertisement
Advertisement