ఈ కంపెనీలైతే బాగుంటాయి
ఓ సంస్థ నుంచి మరో సంస్థకు మారాలన్నా, కొత్తగా ఏదైనా సంస్థలో ఉద్యోగంలో చేరాలన్నా సామర్థ్యానికి తగ్గా పనితో పాటూ మంచి సంస్థల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అయితే కేవలం పని, జీతం మాత్రమే కాకుండా ఉద్యోగులకు ఇచ్చే మరిన్ని సదుపాయాలను ఆధారంగా చేసుకొని సంస్థల ర్యాంకులను బేరీజు వేసే గ్లాస్డూర్ ఈ ఏడాదికిగానూ బెస్ట్ ప్లేసెస్ టు వర్క్ పేరుతో టాప్ సంస్థల వివరాలను విడుదల చేసింది. పని చేయడానికి అత్యంత అనువైన టాప్ కంపెనీల జాబితాను గ్లాస్డూర్ వెబ్ సైట్ వెల్లడించింది. ఆన్లైన్ సర్వేలో పాల్గొన్న గ్లాస్డూర్ సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపారు.
అమెరికా:
అమెరికాలో టాప్ స్థానంలో బెయిన్ & కంపెనీ నిలిచింది. 2009 నుంచి టాప్5 జాబితాలో ఈ సంస్థ చోటు సంపాదిస్తూనే ఉంది. వృత్తిపరమైన అభివృద్ధి, మంచి పని తీరు, ఉద్యోగులకు ఉత్తమ ప్రయోజనాలను అందించడం ద్వారా తొలి స్థానంలో నిలిచింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ రెండో స్థానంలో నిలిచింది. ఉద్యోగులకు ఉచిత ఆహారం అందించడంతో పాటూ పని చేయడానికి కావాల్సిన మంచి వాతావరణం ఫేస్ బుక్ కార్యాలయం అందిస్తుంది.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు మూడో స్థానం దక్కింది. తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే విధంగా మేనేజ్ మెంట్ ప్రణాళికలు ఉంటాయి. గూగుల్ ఉద్యోగులకు కల్పిస్తున్న ప్రయోజనాలు, ఒత్తిడి లేని పని వాతావరణం నాలుగో స్థానంలో నిలిపాయి. సంస్థలో పనిని, ఉద్యోగి జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నతమైన ప్రమాణాలతో నిర్వహిస్తున్న వరల్డ్ వైడ్ టెక్నాలజీ ఐదో స్థానంలో నిలిచింది.
యూనైటెడ్ కింగ్డమ్:
ట్రావెల్ పోర్టల్ ఎక్స్పీడియా తొలి స్థానంలో నిలిచింది. ఉద్యోగులకు కల్పిస్తున్న ప్రయోజనాలతో పాటూ ముఖ్యంగా ఉద్యోగులకు విహారయాత్రలకు కూడా బోలెడన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఏఆర్ఎం హోల్డింగ్స్, రెండో స్థానంలో నిలిచింది. 2016లో జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు ఈ సంస్థని చేజిక్కించుకుంది. ఉద్యోగులకు అనువుగా వర్కింగ్ పాలసీలు, పనితో పాటూ పర్సనల్ లైఫ్‌కు కూడా ఎక్కువ సమయం కేటాయించే వెసులుబాటుతో ఉద్యోగులకు మంచి పనివాతావరణాన్ని కల్పించింది.
హోమ్ ఎమర్జెన్సీ రిపేర్ సర్వీసెస్(హోం సర్వ్) మూడో స్థానంలో నిలిచింది. కస్టమర్లకు ఉన్నత ప్రమాణాలతో సేవలందించేలా ఉద్యోగులు కలిసి కట్టుగా పని చేయడంలో సీనియర్ మేనేజ్ మెంట్ పనితీరు అద్భుతం.
ఇంజినీరింగ్ కంపెనీ మోట్ మెక్ డోనాల్డ్ నాలుగో స్థానంలో నిలిచింది. గ్లొబల్ వర్క్ ఎన్విరాన్‌మెంట్‌తో ఉద్యోగులకు ప్రొత్సాహకాలు ఆఫర్ చేస్తోంది. రిక్రూట్మెంట్ ఎక్స్పర్ట్ హెయ్స్ ఐదో స్థానంలో నిలిచింది. వర్క్ హార్డ్, ప్లే హర్డ్ సంస్కృతితో ఉద్యోగులు జట్టుగా పని చేసేలా అవకాశం కల్పిస్తుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తుంది.
జర్మనీ
జర్మనీకి చెందిన సాఫ్ట్ వేర్ సంస్థ సాప్(ఎస్ఏపీ) తొలిస్థానంలో నిలిచింది. ఉద్యోగులకు తగిన జీతాలు, బెనిఫిట్స్, మంచి వాతావరణం కల్పిస్తోంది .జర్మనీకే చెందిన మరో సంస్థ ఆడిడాస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. స్కోర్ట్స్కు సంబంధించి ప్రోడక్ట్లను తయారు చేసే ఈ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉద్యోగులకు అన్ని సదుపాయాలను కల్పింస్తోంది.
ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌కు చెందిన రాబర్ట్ బోస్క్ మూడో స్థానంలో నిలిచింది. రాబర్ట్ బోస్క్కి ఆటోమేటివ్ కంపోనెంట్స్ తయారీలో జర్మనీలోనే అగ్రసంస్థగా పేరుంది. ఉద్యోగులకు కార్పోరేట్ సదుపాయాలతో పాటూ ప్లెక్సిబుల్ వర్కింగ్ పాలసీలను రూపొందించింది. మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నాలుగు, ఆక్సెంచర్ ఐదో స్థానంలో నిలిచాయి.
కెనడా
ఈ కామర్స్ దిగ్గజం షాప్ఫీ కెనడాలో తొలిస్థానంలో నిలిచింది. సాఫ్ట్వేర్ కంపెనీ సెరిడియన్, రెండో స్థానంలో, ఫైనాన్సియల్ సర్వీస్ ప్రొవైడ్ ఏటీబీ ఫైనాన్షియల్ మూడో స్థానం కైవసం చేసుకున్నాయి. సేల్స్‌ఫోర్స్, సిస్కో సిస్టమ్స్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఫ్రాన్స్
సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తొలి స్థానంలో నిలిచింది. అత్యత్భుతమైన కేరీర్ డెవలప్మెంట్ అవకాశాలను మైక్రో సాఫ్ట్ తమ ఉద్యోగులకు కల్పిస్తోంది. రెండో స్థానంలో లెరోయ్ మెర్లిన్, మూడో స్థానంలో డెకాత్లోన్ నిలిచాయి. నాలుగో స్థానంలో ఎయిర్ బస్ గ్రూప్, ఐదో స్థానంలో టోటల్ కైవసం చేసుకున్నాయి.