
తెలంగాణ ఓటర్లు 2.82 కోట్లు
పురుషులకన్నా మహిళా ఓటర్లే ఎక్కువ
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తరువాత తొలిసారిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఈ నెల 13వ తేదీన ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభంకాగా.. డిసెంబర్ 8వ తేదీ వరకు కొనసాగనుంది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండే యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదుకు అర్హులు. అలాగే ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవడానికి, ఏవైనా సవరణలు చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం జిల్లాల వారీగా ముసాయిదా జాబితాలను ఆదివారం ప్రకటించింది.
ఆ ముసాయిదా జాబితా ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,82,66,089. ఇందులో పురుష ఓటర్లు 1,44,42,254 మందికాగా.. మహిళా ఓటర్లు 1,38,21,536 మంది. మొత్తంగా మహిళా ఓటర్ల కన్నా పురుష ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. హిజ్రా ఓటర్లు ఆంధ్రప్రదేశ్‌లో కన్నా తెలంగాణలో తక్కువగా ఉన్నారు. ఇక్కడ హిజ్రా ఓటర్ల సంఖ్య 2,299 మంది.