జిల్లా వ్యాప్తంగా కరువు తాండవిస్తున్నా 39 మండలాలను మాత్రమే కరువు జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం
చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా కరువు తాండవిస్తున్నా 39 మండలాలను మాత్రమే కరువు జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రకటించింది. జిల్లాలో 66 మండలాలుండగా రెండు నెలల క్రితం అధికారులు అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చాలంటూ నివేదికలు పంపించారు. ప్రభుత్వం పట్టించుకోలేదు.
కరువు మండలాలివే..
కలకడ, ఎర్రావారిపాళెం, కేవీపల్లె, పీటీ యం, వాల్మీకిపురం, పులిచెర్ల, గంగాధరనెల్లూరు, సోమల, సీజీ గల్లు, బెరైడ్డిపల్లె, వి.కోట, బంగారుపాళెం, గుడుపల్లె, తంబళ్లపల్లె, శాంతిపురం, కురబలకోట, కలికిరి, యాదమరి, రొంపిచెర్ల, పూతలపట్టు, ఐరాల, కుప్పం, తవణంపల్లె, మదనపల్లె, చౌడేపల్లె, సదుం, నిమ్మనపల్లె, రేణిగుంట, ఏర్పేడు, పాకాల, పుత్తూరు, వడమాలపేట, రామచంద్రాపురం, తొట్టంబేడు, గంగవరం, పీలేరు, పుంగనూరు, పెద్దమండ్యం, గుర్రంకొండ.