'ఆస్కార్' బరిలో 12 నామినేషన్లతో 'ది రెవనాంట్' | 'Revenant' leads Oscar nominations | Sakshi
Sakshi News home page

'ఆస్కార్' బరిలో 12 నామినేషన్లతో 'ది రెవనాంట్'

Jan 14 2016 7:52 PM | Updated on Sep 3 2017 3:41 PM

'ఆస్కార్' బరిలో 12 నామినేషన్లతో 'ది రెవనాంట్'

'ఆస్కార్' బరిలో 12 నామినేషన్లతో 'ది రెవనాంట్'

88వ ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్ పొందిన చిత్రాల జాబితా విడుదలైంది. గురువారం ఈ జాబితాను విడుదల చేశారు.

న్యూయార్క్: ఆస్కార్ అవార్డుల సీజన్ మొదలైంది. 88వ ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్ పొందిన చిత్రాల జాబితా విడుదలైంది. గురువారం ఈ జాబితాను విడుదల చేశారు. ఈసారి ఆస్కార్ అవార్డుల్లో సింహభాగం టైటానిక్ చిత్ర హీరో లియోనార్డో డికాప్రియో నటించిన ది రెవనాంట్ తన్నుకుపోయే అవకాశం ఉంది. ఈ చిత్రం మొత్తం 12 కేటగిరిల్లో ఆస్కార్ నామినేషన్ సాధించింది. 19వ శతాబ్దానికి చెందిన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడువంటి 12 విభాగాల్లో నామినేషన్ పొందింది.
ఇంకా నామినేషన్ పొందిన ఉత్తమ చిత్రాలను పరిశీలిస్తే..
ది రెవనాంట్
స్పాట్ లైట్
ది బిగ్ షార్ట్
మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్
ది మార్టీయన్
బ్రూక్లిన్
బ్రిడ్జి ఆఫ్ స్పైస్
రూమ్

ఉత్తర దర్వకత్వ విభాగంలో..
అలెజాండ్రో జీ ఇనార్రిటు- ది రెవనాంట్
టామ్ మెక్ కార్తి-స్పాట్ లైట్
జార్జ్ మిల్లర్-మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్
లెన్నీ అబ్రహాంసన్-రూమ్
అడామ్ మెక్ కే-ది బిగ్ షార్ట్

ఉత్తమ నటి విభాగంలో
కేట్ బ్లాంకెట్-కెరోల్
బ్రియే లార్సన్-రూమ్
చార్లోటి ర్యాంప్లింగ్-45 ఇయర్స్
సావోయిర్స్ రోనాన్-బ్రూక్లిన్
జెన్నిఫర్ లారెన్స్-జాయ్

లీడింగ్ యాక్టర్ విభాగంలో..
బ్రియాన్ క్రాంస్టన్
మట్ డామన్
లియోనార్డో డికాప్రియో
మైఖెల్ ఫాస్ బెండర్
ఎడ్డీ రెడ్ మైనే
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement