వైద్యాధికారి పోస్టుల జాబితా విడుదల
Published Sat, Jul 23 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
నిజêమాబాద్ అర్బన్: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిన నియమించే వైద్యాధికారి పోస్టుల జాబితాను విడుదల చేసినట్లు డీఎంహెచ్‌వో వెంకట్ తెలిపారు. www.nizamabad.nicలో జాబితాను పొందుపరిచినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాబితాలో పేర్లు గల అభ్యర్థులు ఈ నెల 28న ఉదయం 10.30 గంటలకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement