వాషింగ్టన్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తర కొరియాను చేరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తర కొరియాను ఎప్పుడో ఉగ్రవాద ప్రోత్సాహ దేశంగా గుర్తించాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం నేపథ్యంలో ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షల్ని అమెరికా ఆర్థిక శాఖ నేడు వెల్లడిస్తుందని ఆయన చెప్పారు. చట్ట వ్యతిరేక అణ్వాయుధ కార్యకమాల్ని ఉత్తర కొరియా తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment