
నెలాఖరులోగా 100 స్మార్ట్ సిటీల జాబితా
హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్మార్ట్ సిటీల జాబితా ప్రకటన ఖరారయింది. సెప్టెంబర్ ఒకటి లోగా అన్నిరకాల కమ్యూనికేషన్ వ్యవస్థలను అనుసంధానించిన 100 స్మార్ట్ సిటీల జాబితాను ప్రకటిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు.
స్మార్ట్ సిటీస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. స్మార్ట్ సిటీల జాబితా ప్రకటనకు సంబంధించిన విషయాలను మీడియాకు వివరించారు. 'ప్రాథమికంగా 20 నగరాలను ఎంచుకుని అన్నిరకాల కమ్యూనికేషన్లను ఒక తాటిపైకి తెచ్చాం.. ఆ తరువాత 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా మలిచాం. ఇక మిగిలింది అధికారిక ప్రకటనే. భవిష్యత్తో మరిన్ని పట్టణాలను స్మార్ట్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది' అని వెంకయ్య పేర్కొన్నారు.