
పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను బిహార్‌లో అధికార పార్టీ జేడీయూ ఆదివారం(మార్చ్ 24) విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 16 సీట్లలో జేడీయూ పోటీ చేస్తోంది. పార్టీ మాజీ చీఫ్ రాజీవ్ రంజన్(లలన్) సింగ్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది.
ఈయన ముంగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్లు నిరాకరించారు. ఇద్దరు కొత్తవారికి పోటీ చేసే అవకాశం కల్పించారు. పార్టీలో చేరిన మరుసటిరోజే విజయ లక్ష్మి కుషావహాకు టికెట్ కేటాయించారు.
ఆర్జేడీ నుంచి ఇటీవలే జేడీయూలోకి వచ్చిన లవ్లీ ఆనంద్ కూడా ఈసారి పార్టీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాగా, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఇటీవలే ఆర్జేడీతో పొత్తు నుంచి వైదొలిగి బీజేపీతో కలిసి బిహార్‌లో మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment