స్మార్ట్ సిటీల జాబితాలో నెల్లూరును చేర్చాలి
కోట: కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో నెల్లూరుకు స్థానం కల్పించేలా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బాధ్యత తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
కోట: కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో నెల్లూరుకు స్థానం కల్పించేలా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బాధ్యత తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దేశ వ్యాప్తంగా వంద స్మార్ట్‌సిటీల అభివృద్ధికి ఏడు వేల కోట్లు కేటాయిస్తూ కేంద్రం ప్రకటిం చిం దని, స్మార్ట్ సిటీల జాబితాలో నెల్లూరుకు స్థానం కల్పించకపోవడం అం దరిని బాధించిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోటలో శనివారం జరిగిన పార్టీ కా ర్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంటనే ప్రధాన మంత్రి దృష్టికి తీసుకె ళ్లి నెల్లూరును స్మార్ట్ జాబితాలో చేర్చేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. జిల్లా వైఎస్సార్ సీపీకి కంచుకోటగా పేర్కొన్నారు. దుగ్గరాజపట్నం పోర్టుపై సందేహా లు ఉన్నా టీడీపీ నాయకులు మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లా మంత్రి అనుభవ రాహిత్యం కారణంగా దుగ్గరాజపట్నం పోర్టు, ఎరువుల కర్మాగారం, విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. రుణమాఫీపై ప్ర స్తుత పరిస్థితి కొనసాగితే రైతులే చంద్రబాబుకు రాజకీయంగా ఉరి వేస్తారని హెచ్చరించారు.
అధికారులూ పొరపాట్లు
చేయకండి : ఎమ్మెల్యే సునీల్
ఎమ్మెల్యే గ్రాంటుని ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేక పోవడంలో ఎంపీ,జెడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతామని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తెలిపారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరిం చాలని సూచించారు. నియోజకవర్గంలో కొన్ని రాజ్యాంగేతర శక్తులు పెత్తనం చేయడానికి చూస్తున్నాయ ని వాటికి సహరించవద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, మం డల ఉపాధ్యక్షుడు మధు, కోట స ర్పంచ్ రాఘవయ్య,చిట్టేడు సర్పం చ్ రాము,సన్నారెడ్డి శ్రీనివాసులురె డ్డి, దువ్వూరు రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలివైన మోసగాడు బాబు
వాకాడు : ప్రపంచంలో తెలివైన మోసగాడు ఎవరైనా ఉంటే అది చంద్రబాబేనని ప్రసన్నకుమార్‌రెడ్డి అభివర్ణించారు. రుణమాఫీ పేరుతో ప్రజలను మభ్యపెట్టాడన్నారు. ప్రభుత్వ మోసపూరిత విధానాలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నెల రోజుల్లో పార్టీ అన్ని కమిటీలను నియమిస్తామని చెప్పారు. పార్టీకి అనుబంధంగా చేనేత,మత్స్యకారుల కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
ప్రసన్నను అభినందించిన
నేదురుమల్లి
జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఎన్ ప్రసన్నకుమార్‌రెడ్డిని పార్టీ సీనియర్ నేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి అభినందించారు. వాకాడులోని తన నివాసంలో ప్రసన్నకు శాలువా కప్పి సత్కరించారు. మొదట పద్మనాభరెడ్డి ఆరోగ్య పరిస్థితిని ప్రసన్న వాకబు చేశారు. ఆయన వాకాడు మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయశేఖర్‌రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, దొరవారిసత్రం నేత బాలచంద్రారెడి,్డ పెళ్లూరు కోటీశ్వరరెడ్డి, చంద్రమౌళిరెడ్డి, నెల్లూరు పెంచలరెడ్డి, యల్లంటి వెకటసుబ్బారెడ్డి,కాశీపురం శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.