ఇటీవలే యానిమల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. తాజాగా ఈ కన్నడ భామ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా- 30- అండర్- 30 జాబితాలో స్థానం సంపాదించుకుంది. కాగా.. ప్రతి సంవత్సరం పలు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇవాళ విడుదల చేసిన జాబితా 30 ఏళ్లలోపు ఉన్నవారిలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసింది. ఈ లిస్ట్‌లో రష్మిక నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. కాగా.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ సరసన పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉంది. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Gratitude.. 🤍#Forbes30under30 pic.twitter.com/u0YliOF0g9
— Rashmika Mandanna (@iamRashmika) February 15, 2024
Comments
Please login to add a commentAdd a comment