♦ గురుకుల మెయిన్స్ అభ్యర్థుల జాబితా
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో టీజీటీ, పీజీటీ, పీడీ ఉద్యోగాలకు సంబంధించి మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ వివరాలు మాత్రమే జాబితాలో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలు గత నెల 31న టీఎస్‌పీఎస్సీ నిర్వహించగా ఫలితాలను ఈ నెల 21న విడుదల చేసింది.
టీజీటీ, పీజీటీ, పీడీ విభాగాల్లో మొత్తం 2,859 ఉద్యోగాలున్నాయి. ఇందులో టీజీటీ 2,340 పోస్టులు, పీజీటీ 513 పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ విభాగంలో 6 పోస్టులున్నాయి. ఒక్కో పోస్టుకు సగటున 15 మంది అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు ఎంపిక జాబితా ప్రకటించింది. మొత్తం 2,859 పోస్టులకుగాను 42,885 మందిని మెయిన్ పరీక్షలకు పిలవాల్సి ఉంది. అయితే, కొన్ని కేటగిరీ ల్లో కులాలవారీగా 1:15 సంఖ్యకు సరిపోయేలా అభ్యర్థులు లేరు. దీంతో అందుబాటులో ఉన్న వారినే పరిగణిస్తూ ఎంపిక జాబితా ప్రకటించింది.
గురుకుల మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా...
టీజీటీ పీజీటీ
సబ్జెక్టు ఎంపికైన అభ్యర్థులు సబ్జెక్టు ఎంపికైన అభ్యర్థులు
బయో సైన్స్ 5,087 బయో సైన్స్ 317
మ్యాథ్స్ 11,093 మ్యాథ్స్ 1,550
ఫిజికల్ సైన్స్ 3, ఫిజికల్ సైన్స్ 2,368
జనరల్ సైన్స్ 3,006 సోషల్ స్టడీస్ 2,410
సోషల్ స్టడీస్ 6,404 పీడీ 45
టీఎస్‌పీఎస్సీ వెబ్సైట్లో
Published Sun, Jun 25 2017 2:39 AM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM
Advertisement
Advertisement