జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఓటర్ల నమోదు దరఖాస్తుల వివరాలు అధికారులు సో మవారం వెల్లడించారు. మొత్తం 35951 దరఖాస్తులు(ఫారం-6) అధికారులకు అందాయి. అయితే వీటిలో తొలిసారిగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నవారు అంటే.. 18నుంచి 19ఏళ్ల మద్య వయస్కులు 9509 మంది ఉండటం విశేషం.
అయితే ఉత్సాహంగా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసకున్నవారిలో ఎంతమందికి అధికారులు ఓటర్ల జాబితాలో చోటుకల్పిస్తారో చూడాలి. ఇప్పటికే నవంబర్ మూసాయిదా అనంతరం దరఖాస్తు చేసుకున్న వారిలో 90 శాతం మందికి అధికారులు జాబితాలో చోటివ్వలేదు. అంతేకాదు చెప్పపెట్టకుండా చాలామంది పేర్లు జాబితా నుంచి తొల గించారు. ఈ విషయంపై ఆదివారం ప్రజలు నిలదీస్తే అధికారులు నీళ్లు నమిలారు తప్ప.. సమాధానం చెప్పలేకపోయారు. ఆందోళన చేసినవారందరినీ మళ్లీ దర ఖాస్తు చేసేకోమని చెప్పారు.
దరఖాస్తులకు ఇంకా అవకాశం
ఓటరుగా ఇప్పటికీ నమోదు చేసుకోనివారు తమ ఓటు కోసం సంబందిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చు. ఈ అవకాశం సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే ముందురోజు వరకు ఉంటుందని అధికారులు చెపుతున్నారు.
ఆదివారం 12నియోజకవర్గాల్లో
అందిన దరఖాస్తుల వివరాలు
నియోజకవర్గం 18-19ఏళ్ల వారు 19సం.పైవారు
జనగామ 777 2746
స్టేషన్‌ఘన్‌పూర్ 467 2193
పాలకుర్తి 351 1716
డోర్నకల్ 602 2534
మహబూబాబాద్ 1180 3101
నర్సంపేట 871 943
పరకాల 1313 2810
వరంగల్(ప) 284 2815
వరంగల్(తూ) 392 1320
వర్ధన్నపేట 82 2306
భూపాలపల్లి 936 2367
ములుగు 2254 1591
మొత్తం 9509 26442