vote registriration
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే
అమెరికా నుంచి సాక్షి టీవీ ప్రతినిధి ఇస్మాయిల్అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అటు డెమొక్రాట్లు ఇటు రిపబ్లికన్లు పూర్తిగా విడిపోయిన నేపథ్యంలో ఒక వర్గం మాత్రం మౌనం వహిస్తోంది. అటు హారిస్‌కు కానీ ఇటు ట్రంప్‌కు గానీ మద్దతు ఇవ్వడంపై వీరు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించడం లేదు. వారే స్వతంత్ర ఓటర్లు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే. నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో విస్తరించి ఉన్న స్వతంత్ర ఓటర్లే నిర్ణాయకం కాబోతున్నారు. పెరుగుతున్న స్వతంత్ర ఓటర్ల సంఖ్యప్రముఖ శాంపిల్ సర్వే గాలప్ పోల్ డేటా ప్రకారం 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 43 శాతం తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 27% మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులుగా, మరో 27 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ప్రకటించుకున్నారు. 1990లో కేవలం 32 శాతం మంది ఓటర్లు మాత్రమే తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించుకున్నారు. కాలంతో పాటు ఇండిపెండెంట్ ఓటర్ల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.7 రాష్ట్రాల్లో కీలకం⇒ అమెరికాలో పార్టీతో అనుబంధం అనేది చాలా సాధారణ మైన అంశం. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రైమ రీస్‌లో ఓటు వేసేందుకు చాలామంది పార్టీ ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ప్రైమరీస్ అంటే ఒక పార్టీ నుంచి ఎవరు అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలనే విషయంపై జరిగే పోలింగ్. సాధారణ ఓటర్లు ఈ పోలింగ్‌లో పాల్గొంటారు. వీరు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలంటే చాలా రాష్ట్రాల్లో కచ్చితంగా ఏదో ఒక పార్టీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఈ డేటా ప్రకారమే చాలామందిని అమెరి కాలో డెమొక్రాట్ ఓటర్లు, రిపబ్లికన్ ఓటర్లుగా పిలుస్తారు.అమెరికాలో సర్వే సంస్థలు తాము చేసే సర్వేల ఆధారంగా పార్టీ ఓటర్ల సంఖ్యను లెక్కగడుతోంది. దీని ఆధారంగానే ఏ పార్టీకి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే విషయం తేలుతుంది. ఈ గణాంకాల ఆధారంగానే చాలా రాష్ట్రాలను బ్లూస్టేట్స్, రెడ్ స్టేట్స్‌గా తేలుస్తారు. డెమొక్రాట్ ఓటర్లు ఎక్కువగా ఉంటే అది బ్లూ స్టేట్ అని రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటే రెడ్ స్టేట్ అని తేలిపోతుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు దాదాపు ఊహించిన దానికి అనుకూలంగానే ఉంటాయి. ఎక్కడైతే రెండుపార్టీల మద్దతు దారుల మధ్య తేడా మూడు శాతం కంటే తక్కువగా ఉంటుందో దానిని బ్యాటిల్ స్టేట్ లేదా పర్పుల్ స్టేట్‌గా పిలుస్తారు. ఇప్పుడు ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఉన్నాయని భావిస్తుండగా..వీటిల్లో ఈ ఇండిపెండెంట్ ఓటర్లే నిర్ణాయక శక్తిగా మారారు.కొత్త తరం ఓటర్లే ఎక్కువ..అమెరికాలోని కొత్త తరం ఎక్కువగా స్వతంత్ర భావాలు కలిగి ఉంది. ముఖ్యంగా మిలేనియల్స్ లేదా జనరేషన్ వై ఎక్కువగా ఇండిపెండెంట్ ఓటర్లుగా ఉన్నారని పరిశోధనలో తేలింది. స్వతంత్ర ఓటర్లలో 1981–96 మధ్యలో జన్మించిన జనరేషన్ వైకి చెందిన వారే 36% మంది ఉన్నారు. ఇక తరువాతి తరం అంటే 1997– 2012 మధ్య జన్మించిన జెన్‌జీ స్వతంత్ర ఓటర్లలో 26% ఉన్నారు. అంటే స్వతంత్ర ఓటర్లలో 52% మంది వై, జీ తరంవారే.ఇక ఓటర్ల మూలాలను పరిశీలిస్తే 31% మంది నల్ల జాతీయులు, 52% మంది లాటినోస్, 43% మంది ఏషియన్ అమెరికన్లు తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించు కున్నారు. మాజీ సైనికులు సైతం పెద్ద ఎత్తున తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 18–49 సంవత్సరాల మద్య ఉన్న దాదాపు 59% మంది మాజీ సైనికులు తమను తాము స్వతంత్ర ఓటర్లుగా చెప్పుకుంటున్నారు.పేరుకే స్వతంత్ర ఓటర్లు⇒ అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసే ఈ స్వతంత్ర ఓటర్లపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సర్వేల్లో తమను తాము స్వతంత్ర ఓట ర్లుగా చెప్పుకునే వీరంతా నిజంగానే స్వతంత్ర ఓటర్లా? అన్న విషయంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మీరు ఏ పార్టీ భావ జాలాన్నినమ్ముతున్నారన్నప్పుడు వీరిలో చాలామంది రిపబ్లికన్ లేదా డెమొక్రాట్ పార్టీకి మద్దుతుదారు లుగా తేలిందని కీత్ అనే అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్ ‘ది మిత్ ఆఫ్ ఇండిపెండెంట్ ఓటర్’పుస్తకంలో వివరించడం గమనార్హం. చాలామంది తమను తాము ఇండిపెండెంట్ ఓటర్‌గా చెప్పుకున్నప్పటికీ ఏదో ఒక స్థాయిలో రాజకీయ పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నారని పరిశోధనల్లో బయటపడింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో 10 శాతానికి మించి నిజమైన స్వతంత్ర ఓటర్లు లేరని అక్కడి రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.కొత్త అభ్యర్థుల వైపే వీరి మొగ్గుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త అభ్యర్థుల వైపే ఇండిపెండెంట్ ఓటర్లు ఎక్కు వగా మక్కువ చూపుతున్నా రని గణాంకాలు చెబుతు న్నాయి. 2008లో బరాక్ ఒబామా పోటీ చేసిన సందర్భంగా దాదాపు 54% స్వతంత్ర ఓటర్లు ఆయనకు ఓటువేశారు. 2016లో ట్రంప్‌కు 52% మంది ఇండిపెండెంట్ ఓటర్లు మద్దతు పలికారు. ఇక 2020లో జో బైడెన్‌కు అత్యధికంగా 56.5 శాతం మంది మద్దతు తెలిపారు.⇒ ఇండిపెండెంట్ ఓటర్లలో 75శాతం మంది ఓటర్లు తమ వ్యక్తిగతమైన ఆర్థిక స్థితిని ప్రభావితం చేయగల అంశాలే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. ⇒ 73 శాతం మంది నేరాలను అదుపు చేసేవారికే తమ ఓటు అని చెబుతున్నారు. ⇒ 63 శాతం మంది అమెరికా తన మిత్రదేశాల కోసం అత్యధికంగా ఖర్చు చేయడం సరికాదంటున్నారు. ⇒ 57 శాతం అబార్షన్ హక్కులే తమ ప్రాధాన్యత అంటున్నారు⇒ 56 శాతం జాత్యహంకారం తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు. -
నిమ్మగడ్డపై మంత్రి పెద్దిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, తిరుపతి: ఓటు నమోదు చేసుకోవడం చేత కాని వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా ఉండటం తమ దౌర్భాగ్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తన పరిధిలోని అధికారాలపై లెక్చర్లు దంచికొట్టే నిమ్మగడ్డకు ఓటు ఎలా, ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలీకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఎస్ఈసీని నిలదీశారు. చంద్రబాబుకు మేలు చేస్తే ఎమ్మెల్యేనో, ఎంపీనో చేస్తారని నిమ్మగడ్డ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్ఈసీ చర్యలు ఆక్షేపణీయమని ఆయన పేర్కొన్నారు. తొలిదశలో పంచాయతీ ఎన్నికల్లో 500లకుపైగా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని ఆయన వెల్లడించారు. ఏకగ్రీవమైన అభ్యర్థులు డిక్లరేషన్ పత్రాలు తీసుకున్నాక రిజల్ట్‌ను హోల్డ్‌లో పెట్టే అధికారం నిమ్మగడ్డకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఏకగ్రీవాలు జరగకూడదని ఏ చట్టంలోనైనా ఉందా అని ఎస్ఈసీని నిలదీశారు. రిటర్నింగ్ అధికారి అధికారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎస్ఈసీకి లేదన్నారు. నిమ్మగడ్డ అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయన మాటాలు విని అధికారులెవరు కూడా అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అలా కాదని ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులపై భవిష్యత్తులో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఈసీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు స్పందనగా.. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదు అవకాశం కల్పిస్తామని ఈసీ, కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కొత్తగా మరో నోటిఫికేషన్ జారీచేస్తామని వెల్లడించింది. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువును డిసెంబరు 7 వరకు గడువు పెంచాలంటూ న్యాయవాది రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువు నేటితోనే ముగుస్తుందని ఈసీ కోర్టుకు తెలిపింది. చట్టప్రకారం నవంబరు 7లోపే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. ఒకవేళ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది.(చదవండి: అక్రమార్కులను ప్రోత్సహిస్తారా ?) -
ఓటుకు మిగిలింది ఒక్క రోజే..
సాక్షి, చిత్తూరు : ఏప్రిల్ 11న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 15 వరకు మాత్రమే ఓటు హక్కు పొందేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని వారు ఓటుకోసం నమోదు చేసుకోవాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. ఈ ఒక్కరోజు పూర్తయితే ఓటు నమోదుకు అవకాశం ఉండదని అధికారులు విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. నమోదు కోసం ఫారం–6 2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన యువత అందరూ ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం చేయాల్సింద ల్లా ఆన్లైన్లో ఫారం–6 దరఖాస్తు చేయడమే. ఆన్లైన్లో www.ceoandhra.nic.in వెబ్సైట్లో ఫారం–6 దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఒక ఫోటో, ఆధార్‌కార్డు, వయస్సు ధ్రువీకరణపత్రం, నివాస స్థల ధ్రువీకరణపత్రాన్ని అప్లోడ్ చేయాలి. ఆ తరువాత విచారణ కోసం సంబంధిత పోలింగ్ కేంద్రం బీఎల్వో ఇంటికి వద్దకే వస్తారు అప్పుడు వారికి ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ వివరాలు, చిరునామా తప్పుగా ఉండడం, పేరు తప్పుగా ఉండడం, ఫోటో సరిగా లేకపోవడం లాంటివి ఉన్నాయి. అలాంటి వారు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందువల్ల ఓటరు జాబితాలో పేర్లకు సంబంధించి ఆక్షేపణ, తొలగించడానికి సంబంధించిన ఫారం–7 దరఖాస్తుల స్వీకరణ నిలిపివేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో ఫారం–7కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. సర్వర్ మొరాయింపు ఓటు హక్కు పొందేందుకు శుక్రవారమే చివరి రోజు కావడంతో ఆన్లైన్ సర్వర్ మొరాయిస్తోంది. చివరి రోజు ముగిస్తే ఆ తరువాత వచ్చే దరఖాస్తులను స్వీకరించలేదని, అలా దరఖాస్తు చేసుకునే వారి పేర్లు ఓటర్ల జాబితా నమోదు కావని ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. దీంతో ఓటు హక్కు లేని వారు, గతంలో ఉన్నా పలు కారణాలతో బీఎల్వోలు చేసిన తప్పిదాలకు ఓట్లు పొగొట్టుకున్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో సర్వర్ మొరాయిస్తుండడంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్ సెంటర్లు, మీ–సేవ కేంద్రాల్లో ప్రయత్నిస్తుంటే ‘దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్’ అని వస్తోంది. ఓటు నమోదుకు ఆన్లైన్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మ్యానువల్‌గా దరఖాస్తులు అందించాలనుకుంటే బీఎల్వోలు అందుబాటులోలేరు. నూతన ఓటర్లకు 1,11,660 కార్డులు జిల్లాలో ఇటీవల ఓటు దరఖాస్తు చేసుకున్న వారికి నూతన ఓటరు కార్డులను అందివ్వనున్నా రు. అందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి జిల్లాకు 1,11,660 ఎపిక్ ఓటరు కార్డులు రానున్నాయి. వచ్చే ఓటరు కార్డులను తహసీల్దార్లకు చేర్చి వారి ద్వారా సంబంధిత ఓటర్లకు సరఫరా చేయనున్నారు. తంబళ్లపల్లె : 5,415 పీలేరు : 4,096 మదనపల్లె : 10,089 పుంగనూరు : 8,791 చంద్రగిరి : 13,980 తిరుపతి : 17,921 శ్రీకాళహస్తి : 8,357 సత్యవేడు : 6,039 నగరి : 6,704 జీడీనెల్లూరు : 5,537 చిత్తూరు : 8,225 పూతలపట్టు : 5,298 పలమనేరు : 7,501 కుప్పం : 3,707 -
ఓటరు నమోదుకు మరో చాన్స్
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే కీలకం. దీనికి మరో ప్రత్యామ్నాయం లేనేలేదు. గ్రామంలో వార్డు సభ్యుడు మొదలుకుని స్థానిక ప్రజా ప్రతినిధులు, చట్టసభల్లో కూర్చునే ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నిక బాధ్యత పౌరుడిదే. పేద, ధనిక, కులం, వర్గం, లింగ వివక్షలేని పౌరహక్కు అందరికీ ఒక్కటే. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు ఉంటుంది. తమకు తక్షణ ప్రయోజనం కల్పించే అన్నింటికీ ఇది ఉపయోగపడుతుంది. సాక్షి, వరంగల్ రూరల్: ఓటరు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. భారత ఎన్నికల సంఘం 2018 జనవరి 1 అర్హత తేదీగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ ప్రకటించారు. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట, భూపాలపల్లి, ములుగు, పాలకుర్తి, జనగామ, మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్పెషల్ సమ్మరీర రివిజన్(ఎస్ఎస్ఆర్) కార్యక్రమం నిర్వహిస్తోంది. అన్ని పోలింగ్ కేంద్రంలో ఓటరు జాబితాలో నమోదు, సవరణల గురించి క్లెయిములు, అభ్యంతరాలను స్వీకరించేందు కు ఫిబ్రవరి 14 చివరి తేదీగా నిర్ణయించారు. క్లెయిములు అభ్యంతరాలను మార్చి 5 వరకు పరిష్కరించి, నమోదులు, సవరణల తుది జాబితాను మార్చి 24న ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 4 అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టారు. 11న సైతం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంట ల వరకు నిర్వహిస్తారు. బూత్ లెవెల్ అధికారులు సంబం« దిత పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉంటారు. ము సాయిదా ఓటరు జాబితా, సంబంధిత ఫారాలు అన్ని ని యోజకవర్గాల పరిధిలోని పోలింగ్ స్టేషన్లు, బూత్ లెవెల్ అధికారులు, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. దరఖాస్తు నమూనాల వివరాలు.. ఫారం–6: కొత్తగా పేరు నమోదు చేయించుకునేవారి వయసు 2018 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. (1999 డిసెంబర్ 31లోపు, 2000 జనవరి 1న జన్మించినవారు) వాస్తవంగా నివాసం ఉండి జాబితాలో పేరు తప్పిపోయినవారు ఫారం–6లో దరఖాస్తు చేసుకోవాలి. 19 సంవత్సరా లు పైబడిన వారు వేరే నియోజకవర్గంలో పేరు నమోదై ఉంటే ఫారం–6లో ఇంతకు ముందే నమోదైన నియోజకవర్గం పేరు, పోలింగ్ స్టేషన్ నంబర్, వరుస సంఖ్యలతో కూడిన వివరాలు తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. ఎక్కడైతే రాత్రి పూట నిద్రిస్తారో అదే స్థానికతగా గుర్తించి ఓటరు నమోదుకు అర్హత కలిగి ఉంటారు. ఫారం–7: ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపుల గురించి సంబంధిత నియోజకవర్గం మాత్రమే అయివుండి అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఫారం –8: ఓటరు జాబితాలోని ఓటరు, తండ్రి పేరు ఇతర వివరాలు తప్పుగా నమోదైతే సరిచేసేందుకు ఈపీఐసీ నంబర్ తప్పనిసరి. ఫారం 8ఎ: నియోజకవర్గంలో ఓటరు నివసిస్తున్న పోలింగ్ స్టేషన్ నుంచి ఇతర పోలింగ్ స్టేషన్‌కు మార్చుకొనేందుకు. సద్వినియోగించుకోవాలి... ఓటరు నమోదు కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలి. ఫిబ్రవరి 14 వరకు కొత్త ఓటర్ల నమోదు కొనసాగుతుంది. కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకొని 18 సంవత్సరాలు పైబడిన విద్యార్థినీ విద్యార్థులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేసేందుకు కృషి చేయాలి. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం ఓటర్లు నమోదయ్యేలా 100 శాతం తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు సహకరించాలి. – హరిసింగ్, డీఆర్ఓ, వరంగల్ రూరల్ -
ఓటు కోసం 35951 దరఖాస్తులు
జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఓటర్ల నమోదు దరఖాస్తుల వివరాలు అధికారులు సో మవారం వెల్లడించారు. మొత్తం 35951 దరఖాస్తులు(ఫారం-6) అధికారులకు అందాయి. అయితే వీటిలో తొలిసారిగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నవారు అంటే.. 18నుంచి 19ఏళ్ల మద్య వయస్కులు 9509 మంది ఉండటం విశేషం. అయితే ఉత్సాహంగా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసకున్నవారిలో ఎంతమందికి అధికారులు ఓటర్ల జాబితాలో చోటుకల్పిస్తారో చూడాలి. ఇప్పటికే నవంబర్ మూసాయిదా అనంతరం దరఖాస్తు చేసుకున్న వారిలో 90 శాతం మందికి అధికారులు జాబితాలో చోటివ్వలేదు. అంతేకాదు చెప్పపెట్టకుండా చాలామంది పేర్లు జాబితా నుంచి తొల గించారు. ఈ విషయంపై ఆదివారం ప్రజలు నిలదీస్తే అధికారులు నీళ్లు నమిలారు తప్ప.. సమాధానం చెప్పలేకపోయారు. ఆందోళన చేసినవారందరినీ మళ్లీ దర ఖాస్తు చేసేకోమని చెప్పారు. దరఖాస్తులకు ఇంకా అవకాశం ఓటరుగా ఇప్పటికీ నమోదు చేసుకోనివారు తమ ఓటు కోసం సంబందిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చు. ఈ అవకాశం సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే ముందురోజు వరకు ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ఆదివారం 12నియోజకవర్గాల్లో అందిన దరఖాస్తుల వివరాలు నియోజకవర్గం 18-19ఏళ్ల వారు 19సం.పైవారు జనగామ 777 2746 స్టేషన్‌ఘన్‌పూర్ 467 2193 పాలకుర్తి 351 1716 డోర్నకల్ 602 2534 మహబూబాబాద్ 1180 3101 నర్సంపేట 871 943 పరకాల 1313 2810 వరంగల్(ప) 284 2815 వరంగల్(తూ) 392 1320 వర్ధన్నపేట 82 2306 భూపాలపల్లి 936 2367 ములుగు 2254 1591 మొత్తం 9509 26442