ఓటరు నమోదుకు మరో చాన్స్‌ | vote registration program in warangal | Sakshi
Sakshi News home page

ఓటరు నమోదుకు మరో చాన్స్‌

Published Tue, Feb 6 2018 12:07 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

vote registration program in warangal - Sakshi

వరంగల్‌ రూరల్‌ డీఆర్‌ఓ హరిసింగ్

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే కీలకం. దీనికి మరో ప్రత్యామ్నాయం లేనేలేదు. గ్రామంలో వార్డు సభ్యుడు మొదలుకుని స్థానిక ప్రజా ప్రతినిధులు, చట్టసభల్లో కూర్చునే ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నిక బాధ్యత పౌరుడిదే. పేద, ధనిక, కులం, వర్గం, లింగ వివక్షలేని పౌరహక్కు అందరికీ ఒక్కటే. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు ఉంటుంది. తమకు తక్షణ ప్రయోజనం కల్పించే అన్నింటికీ ఇది ఉపయోగపడుతుంది.
 

సాక్షి, వరంగల్‌ రూరల్‌:  ఓటరు నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది.   భారత ఎన్నికల సంఘం 2018 జనవరి 1 అర్హత తేదీగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకటించారు. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నర్సంపేట, భూపాలపల్లి, ములుగు, పాలకుర్తి, జనగామ, మహబూబాబాద్, డోర్నకల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్పెషల్‌ సమ్మరీర రివిజన్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) కార్యక్రమం నిర్వహిస్తోంది. అన్ని పోలింగ్‌ కేంద్రంలో ఓటరు జాబితాలో నమోదు, సవరణల గురించి క్లెయిములు, అభ్యంతరాలను స్వీకరించేందు కు ఫిబ్రవరి 14 చివరి తేదీగా నిర్ణయించారు. క్లెయిములు అభ్యంతరాలను మార్చి 5 వరకు పరిష్కరించి, నమోదులు, సవరణల తుది జాబితాను మార్చి 24న ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 4 అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టారు. 11న సైతం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంట ల వరకు నిర్వహిస్తారు. బూత్‌ లెవెల్‌ అధికారులు సంబం« దిత పోలింగ్‌ కేంద్రంలో అందుబాటులో ఉంటారు. ము సాయిదా ఓటరు జాబితా, సంబంధిత ఫారాలు అన్ని ని యోజకవర్గాల పరిధిలోని పోలింగ్‌ స్టేషన్లు, బూత్‌ లెవెల్‌ అధికారులు,  తహసీల్దార్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు.  
 

దరఖాస్తు నమూనాల వివరాలు..
ఫారం–6: కొత్తగా పేరు నమోదు చేయించుకునేవారి వయసు 2018 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. (1999 డిసెంబర్‌ 31లోపు, 2000 జనవరి 1న జన్మించినవారు) వాస్తవంగా నివాసం ఉండి జాబితాలో పేరు తప్పిపోయినవారు ఫారం–6లో దరఖాస్తు చేసుకోవాలి. 19 సంవత్సరా లు పైబడిన వారు వేరే నియోజకవర్గంలో పేరు నమోదై ఉంటే ఫారం–6లో ఇంతకు ముందే నమోదైన నియోజకవర్గం పేరు, పోలింగ్‌ స్టేషన్‌ నంబర్, వరుస సంఖ్యలతో కూడిన వివరాలు తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. ఎక్కడైతే రాత్రి పూట నిద్రిస్తారో అదే స్థానికతగా గుర్తించి ఓటరు నమోదుకు అర్హత కలిగి ఉంటారు.
ఫారం–7: ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపుల గురించి సంబంధిత నియోజకవర్గం మాత్రమే అయివుండి అభ్యంతరాలు తెలియజేయవచ్చు.
ఫారం –8: ఓటరు జాబితాలోని ఓటరు, తండ్రి పేరు ఇతర వివరాలు తప్పుగా నమోదైతే సరిచేసేందుకు ఈపీఐసీ నంబర్‌ తప్పనిసరి. 
ఫారం 8ఎ: నియోజకవర్గంలో ఓటరు నివసిస్తున్న పోలింగ్‌ స్టేషన్‌ నుంచి ఇతర పోలింగ్‌ స్టేషన్‌కు మార్చుకొనేందుకు.

సద్వినియోగించుకోవాలి...
ఓటరు నమోదు కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలి. ఫిబ్రవరి 14 వరకు కొత్త ఓటర్ల నమోదు  కొనసాగుతుంది. కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకొని 18 సంవత్సరాలు పైబడిన విద్యార్థినీ విద్యార్థులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేసేందుకు కృషి చేయాలి. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం ఓటర్లు నమోదయ్యేలా 100 శాతం తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు సహకరించాలి. 
– హరిసింగ్, డీఆర్‌ఓ, వరంగల్‌ రూరల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement