kill list
-
ఆ రెండు స్కూళ్లలో వాళ్లని కాల్చి చంపేస్తా!
ఫ్లోరిడా: రెండు స్కూళ్లలో కాల్పులు జరిపి, చంపాల్సిన ‘కిల్ లిస్ట్‌ను తయారు చేసుకున్నాడు. అందుకు రకరకాల రైఫిళ్లు, పిస్టళ్లతోపాటు, కత్తులను సైతం సిద్ధం చేసుకున్నాడు. కిల్ లిస్ట్‌తోపాటు ఆయుధ సామగ్రి ఫొటోలను ఆన్లైన్లో తన క్లాస్మేట్లకు గొప్పగా చూపించుకున్నాడు. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బాలుడి ఘన కార్యమిది. .! అసలే స్కూళ్లలో కాల్పుల ఘటనలతో జనం గగ్గోలు పెడుతున్న సమయం. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. దీంతో, వారు ‘కార్లో కింగ్స్టన్’ డొరెల్లి’ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారు. అతడు పోగేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ‘క్రీక్ సైడ్ మిడిల్ స్కూల్లో చదువుకుంటున్న కార్లో అనే బాలుడు క్రీక్ సైడ్, సిల్వర్ శాండ్ మిడిల్ స్కూళ్లలో వాళ్లను కాల్చి చంపేందుకు పథకం వేశాడు. పేర్లు, లక్ష్యాలతో జాబితాను సైతం సిద్ధం చేసుకున్నాడు. వీటిని ఆన్లైన్లో పెట్టాడు. ఇదేమని అడిగితే ఒట్టి జోక్ మాత్రమే అంటున్నాడు’ అని ఒలూసియా కౌంటీ షరీఫ్ మైక్ చిట్వూడ్ తెలిపారు. అధికారులు బాలుడికి సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్తున్న వీడియోను ఆయన ‘థ్రెడ్’లో షేర్ చేశారు. అతడిపై శిక్షార్హమైన నేరం కింద కేసు నమోదు చేశామన్నారు. ‘ఉత్తుత్తిగా లేదా నిజంగానే బెదిరింపులకు గురిచేసే పిల్లల ఫొటోలతో వివరాలను బహిర్గతం చేస్తాం. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’అని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
ఐసిస్ 'కిల్ లిస్టు' లో భారత సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తన సైబర్ యాక్టివిటీస్ సంస్థ ఖలీఫత్ సైబర్ ఆర్మీ(సీసీఏ) ద్వారా రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 4,000 మందిని చంపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 'కిల్ లిస్టు' పేరిట వారి పేర్ల జాబితాను విడుదల చేసింది. సగానికి పైగా అమెరికన్ల పేర్లతో కూడిన ఈ జాబితాలో యూకే, ఫ్రాన్స్, కెనడాలకు చెందిన పౌరులతో పాటు 285 మంది భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి. వీరందరినీ వెంటనే అంతమొందించాలంటూ ఐఎస్ఐఎస్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ అకౌంట్ నుంచి ఫాలోవర్స్ కు పిలుపునిచ్చింది. ఐఎస్ఐఎస్ విడుదల చేసిన జాబితాలో చంపాల్సినవారి చిరునామాలతో పాటు ఈ-మెయిల్ ఐడీలు కూడా ఉన్నాయి. ఐఎస్ఐఎస్ ప్రకటించిన 285 మంది భారతీయుల పేర్లలో దేశానికి ఐసిస్ నుంచి రక్షణ కల్పిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పేర్లు ఎక్కువగా ఉన్నాయి. -
ఉగ్రలిస్టులో 8000 మంది
లండన్: అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకొని భారీ నరమేధానికి పాల్పడడానికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కుట్రపన్నారు. దాదాపు 8318 మందిని హతమార్చడానికి కుట్ర పన్నారని ఇందులో 8 వేల మంది అమెరికన్లు ఉన్నట్లు బ్రిటిష్ మీడియా శుక్రవారం వెల్లడించింది. అమెరికా సైబర్ క్రైం విభాగం వీరు హతమార్చాలనుకుంటున్న వారి అడ్రస్, ఈమెయిల్ లను ఐసిస్ ఉగ్రవాదుల నుంచి సేకరించింది. ముస్లింలపై దాడులకు ప్రతీకారంగా వీరిని హతమార్చాలని ఐసిస్ తన మద్దతు దారులను కోరుతోంది. కెనడాకు చెందిన 312, బ్రిటన్ చెందిన39 , ఆస్ట్ర్రేలియాకు చెందిన 69 మంది ఉన్న వీరి లిస్టులో ప్రధానంగా సెలబ్రిటీలు, మిలిటరీ అధికారులు, ప్రజాప్రతినిధులున్నారు.