విశాఖలోని తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రంలోకి ఇద్దరు అగంతకులు ప్రవేశించారన్న ప్రచారం కలకలం రేపుతోంది. నౌకాదళ స్థావరంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారని సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డరుునట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు అప్రమత్తమయ్యారుు. వీరు నావికాదళం ప్రధాన కేంద్రంలోకి గోడ దూకి ప్రవేశిం చినట్టు అనుమానిస్తున్నారు. వారు ఆయుధాలు కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. వీరి ఆచూకీని కనుగొనేందుకు నావికాదళ స్థావరంలో అణువణువూ గాలిస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో గగన తల మార్గంలోనూ అన్వేషిస్తున్నారు.