జమ్మూ: జమ్మూకాశ్మీర్ లోని సౌజానా గ్రామంలో పాకిస్తాన్ నుంచి పంపినట్లు భావిస్తున్న ఆయుధాల బాక్సును పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అందులో ఏకే అస్సాల్ట్ రైఫిల్, మూడు మేగజీన్లు, 30 రౌండ్లు, ఓ టెలిస్కోప్ ఉన్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఇవి దొరకడం గమనార్హం. శనివారం రాత్రి డ్రోన్ శబ్దం వినిపించిందని ఓ గ్రామస్తుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
రంగంలోకి దిగిన పోలీసులు గ్రామాన్ని ఖాళీ చేయించారు. అనంతరం పరిశీలించి చూడగా, ఓ పసుపుపచ్చ ప్యాకెట్ కనుగొన్నారు. అందులో చెక్కతో చేసిన బేస్‌మెంట్‌తో కూడిన డబ్బాలో ఆయుధాలు, ఇతర సామగ్రి కనిపించాయి. వాటిని స్వా«దీనం చేసుకొని ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశారు. భారత్‌లో వాటిని ఎవరు తీసుకోవాల్సి ఉందో గుర్తించేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ నుంచి డ్రోన్‌ల ద్వారా భారత్‌లోని ఉగ్ర ముఠాలకు ఆయుధాల సరఫరా పెరుగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment