
అటవీ సిబ్బందికి ఆయుధాలు: జోగు రామన్న
ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరులైన అటవీశాఖ సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా ‘అటవీ అమరవీరుల సంస్మరణ దినం‘ జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. 1984 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 22 మంది అటవీ సిబ్బంది అమరులయ్యారన్నారు. విధి నిర్వహణలో అటవీ శాఖ అధికారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.