అటవీ శాఖ సిబ్బందికి ఆయుధాలు! | Forest official meet with State government on november 21 due to weapons to forest employees | Sakshi
Sakshi News home page

అటవీ శాఖ సిబ్బందికి ఆయుధాలు!

Published Sun, Nov 10 2013 12:29 PM | Last Updated on Wed, Sep 26 2018 6:01 PM

Forest official meet with State government on november 21 due to weapons to forest employees

అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలు ఇచ్చేందుకు ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించనున్నట్లు అటవీశాఖ ముఖ్య కార్యదర్శి సోమశేఖరరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని నెహ్రు జూలాజికల్ పార్క్లో ఆదివారం జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో సోమశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... అటవీశాఖలో 3,820 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అటవీశాఖ సిబ్బంది విరాళంగా ఇచ్చిన రూ. 2.2 లక్షల చెక్కును ఇటీవల నిజామాబాద్ జిల్లాలో స్మగ్లర్ల దాడిలో చనిపోయిన గంగయ్య కుటుంబానికి ఆయన అందజేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement