రష్యా భారీ స్కెచ్‌..!! | Russia Developing Underwater Drone | Sakshi
Sakshi News home page

రష్యా భారీ స్కెచ్‌..!!

Published Sat, May 19 2018 11:14 AM | Last Updated on Sat, May 19 2018 1:55 PM

Russia Is Developing Underwater Drone - Sakshi

జలాంతర డ్రోన్‌కు సంబంధించిన ఓ చిత్రం

మాస్కో : రష్యా తన ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకునే పనిలో పడిందా?. జలాంతర్గాములతో శత్రు దుర్భేద్యమైన రక్షణను ఏర్పాటు చేసుకుంటోందా?. ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే చెప్పాలి. గత మార్చి నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌ స్టేట్‌ ఆఫ్‌ ది నేషన్‌లో చేసిన ప్రసంగం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. జలాంతర డ్రోన్‌ను అభివృద్థి చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే .

రెండు మెగా టన్నుల బరువైన అణ్వాయుధాలను 70 నాటికల్‌ మైళ్ల దూరానికి ప్రయాణించగలిగే ఓ జలాంతర డ్రోన్‌ను రష్యా తయారు చేయనున్నట్లు సమాచారం. దేశ రక్షణతో పాటు శత్రువుల జలాంతర్గాములను ధ్వంసం చేసే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రష్యా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని  రష్యా న్యూస్‌ ఏజెన్సీ ‘టాస్‌’ తెలిపింది.

ప్రధాని పుతిన్‌ స్టేట్‌ ఆఫ్‌ ది నేషన్‌ వార్షిక సమావేశంలో జలాంతర డ్రోన్‌కు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. గ్రాఫిక్స్‌తో కూడిన ఈ వీడియోలో కొత్త ఆయుధానికి సంబంధించిన శక్తి, సామర్థ్యాలు వివరించడం జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement