ఆయుధాలు తరలిస్తున్నఇద్దరి అరెస్ట్
Published Mon, Oct 3 2016 4:15 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
ఇల్లందు: అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారులో తరలిస్తున్న 9 ఎంఎం కార్బన్‌తో పాటు 5 బుల్లెట్లను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
Advertisement
Advertisement