అమెరికాతో భారత్‌ భారీ ఆయుధ డీల్‌ | US Approves Billion Dollar Naval Weapons Deal With India | Sakshi
Sakshi News home page

అమెరికాతో భారత్‌ భారీ ఆయుధ డీల్‌

Published Thu, Nov 21 2019 10:45 AM | Last Updated on Thu, Nov 21 2019 10:45 AM

US Approves Billion Dollar Naval Weapons Deal With India - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా నుంచి భారత్‌ భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనుంది. ఈ ఆయుధ ఒప్పందం విలువ రూ. 7 వేల కోట్లు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా కాంగ్రెస్‌కు సమాచారం అందించారు. భారత నౌకాదళానికి 13 ఎమ్‌కే45, 5 ఇంచ్‌/62 కేలిబర్‌ (మోడ్‌ 4) నావల్‌ గన్స్‌ అమ్ముతున్నట్లు ట్రంప్‌ చెప్పారు. వీటిని బీఏఈ సిస్టమ్స్‌ అండ్‌ ఆర్మామెంట్స్‌ సంస్థ తయారుచేస్తోంది. ఈ ఆయుధాల ద్వారా భారత్‌ పొరుగు దేశాల నుంచి తనకున్న ప్రమాదాలను ఎదుర్కోగలదని ట్రంప్‌ అధికార కార్యాలయం తెలిపింది. ఈ డీల్‌ ద్వారా అత్యాధునిక ఆయుధాలు కలిగిన దేశంగా భారత్‌ మారిందని చెప్పింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement