జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుల అరెస్ట్
జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుల అరెస్ట్
Published Fri, Oct 28 2016 5:54 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
–మారణాయుధాలు, ఆటో స్వాధీనం
–మరో తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్న పోలీసులు
ఏలూరు అర్బన్ ః
జిల్లాలో సంచలనం సృష్టించిన హత్యకేసులో నలుగురు నిందితులను ఏలూరు టూ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి స్థానిక ఏలూరు సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 13వ తేదీన పట్టపగలు స్థానిక టూ టౌన్ పరిధిలోని చింతచెట్టు సెంటర్ రోడ్‌లో శివకేశవ స్వామి ఆలయం వద్ద చేపలతూము సెంటర్‌కు చెందిన కంచి నరేంద్ర కుమార్ అలియాస్ పెద కృష్ణ (37) అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు కత్తులతో నరికి చంపి పరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో తరచూ జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలను సీరియస్‌గా పరిగణించిన ఎస్పీ భాస్కర్‌భూషణ్ నిందితులను ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటామని ప్రకటించారు. డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు నేతత్వంలో టూ టౌన్ సీఐ బంగార్రాజు, ఎసై ్సలు ఎస్‌ఎస్‌ఆర్ గంగాధర్, అల్లు దుర్గారావులో ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించిన సీఐ ఉడతా బంగార్రాజు బందం ఎట్టకేలకు నిందితులు దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామం సమీపంలో సంచరిస్తున్నారని తెలుసుకుని మాటు వేసి వెంకటాపురం పంచాయితీకి చెందిన బొట్టా చంద్రశేఖర్, అదే గ్రామానికి చెందిన బొట్టా దుర్గాప్రభాకరరావు అలియాస్ దుర్గారావు, నగరంలోని పాండురంగపేటకు చెందిన కోమాకుల శ్రీను అలియాస్ పూల శీను, స్థానిక వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన పిల్లా ప్రశాంత కుమార్ అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారని డీఎస్పీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
– ఇది ప్రతీకార హత్యే
కంచి నరేంద్ర కష్ణ హత్య ప్రతీకార హత్యేనని డీఎస్పీ స్పష్టం చేశారు. మతుడు నరేంద్ర కష్ణ కుమార్ అలియాస్ పెద కష్ణ 2012లో బొట్టా గంగాధరరావు అనే వ్యక్తిని హత్య చేశాడు. దాంతో గంగాధర తమ్ముళ్ళు (ప్రస్తుతం పెద కష్ణ హత్యకేసులో ప్రధాన నిందితులు బొట్టా చంద్రశేఖర్, బొట్లా దుర్గాప్రభాకరరావులు) అన్న గంగాధరరావును కిరాతకంగా హత్య చేసిన పెద కష్ణపై ప్రతీకారం తీర్చుకోవాలనే పగతోనే ఈ హత్యకు పాల్పడ్డారని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.
– హత్యకు సహకరించిన మరో 9మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంది.
కంచి పెద కష్ణ హత్యకు పరోక్షంగా సహకరించిన మరో తొమ్మిదిమంది నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ వివరించారు. నిందితులలో నగర కార్పొరేటర్ భర్త భీమవరపు సురేష్ కుమార్, తాబేలు ధనుంజయ, టోని అలియాస్ మిండాల నాగ శివ, అక్కి మురళి, దండా నాని, వనమాల సతీష్ అలియాస్ కోకిల, దండా చినశేఖర్, రెల్ల, వాసు, మాడుగుల ప్రేమ్‌కుమార్‌లు పరారీలో ఉన్నారని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు.
Advertisement