జిల్లా అభివృద్ధికి అందరి సహకారం అవసరం
Published Tue, Nov 1 2016 6:36 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
ఏలూరు (మెట్రో):
జిల్లా అభివృద్ధికి అందరి సహకారం తీసుకుంటానని జిల్లా రెవెన్యూ అధికారి కె.హైమావతి అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారిగా మంగళవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి వైపు నడిపించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. జిల్లాలో చేపట్టే ఈ ఫైలింగ్ విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తానని ఆమె చెప్పారు. తద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ కాటంనేని బాస్కర్‌ను, జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావును ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం రెవెన్యూ అసోసియేషన్ నాయకులు సాగర్, రమేష్, నాంచారయ్య, పూర్ణచంద్రప్రసాద్, కలెక్టరేట్ ఎఒ సుబ్బారావు నూతన డిఆర్‌ఒను కలుసుకుని పుష్పగుచ్చాలు అందించారు.
Advertisement
Advertisement