Israel's failure to give Kyiv anti-missile systems: యుద్ధంతో అట్టడుకుతున్న ఉక్రెయిన్‌కి అమెరికా దాని మిత్రదేశాలు ఆయుధ సాయం అందించి, మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఐతే ఇజ్రాయెల్ మాత్రం మాటలకే పరిమితమైంది. చేతల విషయానికి వచ్చేటప్పటికీ మొండి చేయి చూపిస్తోంది ఇజ్రాయెల్. దీంతో జెలెన్ స్కీ ఇజ్రాయెల్ తీరుపై చాలా అసంతృప్తిగా ఉండటమే కాకుండా చాలా షాక్‌కి గురయ్యానని అని అన్నారు.
యుద్ధ ప్రారంభ కాలంలోనే ఐరన్‌డోమ్ వ్యవస్థ గురించి ప్రస్తావించాడు జెలెన్ స్కీ. ఈ ఆయుధాన్ని ఇజ్రాయెల్ గాజాలో పాలస్తీనియన్ మిలిటెంట్లు కాల్చే రాకెట్లను అడ్డుకునేందుకు ఉపయోగిస్తుంది. ఐతే ఇజ్రాయెల్ మాత్రం ఉక్రెయిన్‌కి ఆయుధాలను అందించేందుకు నిరాకరిస్తోంది. అయినా తాము ఆయుధ సాయం చేసే విషయమై కట్టుబడిలేము గానీ ఉక్రెయిన్‌కి సాయం చేస్తామని మాత్రమే చెప్పాం అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇజ్రాయెల్. తాము రష్యా దాడిని కచ్చితంగా ఖండిస్తున్నామంటూనే మాస్కోతో సంబంధాలు దెబ్బతినకుండా ఉండేలా అత్యంత జాగురతతో వ్యవహరిస్తోంది. వాస్తవానికి ఇజ్రాయెల్ దళాలు ఇరానియన్ అనుకూల మిలీషియాపై దాడి చేస్తూ ఉంటాయి. అదీగాక ఇజ్రాయెల్ సిరియా విషయమై రష్యాతో కొంత విపత్కర పరిస్థితిని కూడా ఎదర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఉక్రెయిన్‌కి ఆయుధ సాయం అందించేందుకు ముందుకు రాలేకపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment