నయీమ్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పోలీసు ఎన్‌కౌంటర్‌లో నయీమ్ ఖతమైన విషయం తెలిసిందే. అనంతరం అతడి నివాసాలతోపాటు అనుచరుల ఇళ్లల్లో రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా కట్టల కొద్దీ డబ్బు.. పెద్ద ఎత్తున ల్యాండ్ డాక్యుమెంట్లు బయటపడుతున్నాయి. వాటి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించారు.