'ఆయుధాలను వెంటనే వెనక్కి ఇచ్చేయండి' | submit Weapons immediately says by chaderghat SI | Sakshi
Sakshi News home page

'ఆయుధాలను వెంటనే వెనక్కి ఇచ్చేయండి'

Published Wed, Jan 13 2016 5:48 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

submit Weapons immediately says by chaderghat SI

చాదర్‌ఘాట్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో లైసెన్స్డ్ ఆయుధాలు కలిగి ఉన్న వారు వెంటనే సరెండర్ చేయాలని చాదర్‌ఘాట్ ఇన్‌స్పెక్టర్ సత్తయ్య కోరారు.

బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... స్టేషన్ పరిధిలో 52 మంది ఆయుధాలు కలిగి ఉన్నారని, వారందరూ రెండు, మూడు రోజుల్లో ఆయుధాలు అప్పగించాలని సూచించారు. అదే విధంగా స్టేషన్ పరిధిలో ఉన్న 27 మంది రౌడీషీటర్లు స్టేషన్‌కు వచ్చి బైండోవర్ అవ్వాలని పేర్కొన్నారు. స్టేషన్ పరిధిలో 39 పోలింగ్ స్టేషన్‌లు, బూత్‌లు 101 ఉన్నాయని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement