'ఆయుధాలను వెంటనే వెనక్కి ఇచ్చేయండి'
చాదర్ఘాట్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో లైసెన్స్డ్ ఆయుధాలు కలిగి ఉన్న వారు వెంటనే సరెండర్ చేయాలని చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ సత్తయ్య కోరారు.
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... స్టేషన్ పరిధిలో 52 మంది ఆయుధాలు కలిగి ఉన్నారని, వారందరూ రెండు, మూడు రోజుల్లో ఆయుధాలు అప్పగించాలని సూచించారు. అదే విధంగా స్టేషన్ పరిధిలో ఉన్న 27 మంది రౌడీషీటర్లు స్టేషన్కు వచ్చి బైండోవర్ అవ్వాలని పేర్కొన్నారు. స్టేషన్ పరిధిలో 39 పోలింగ్ స్టేషన్లు, బూత్లు 101 ఉన్నాయని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.