ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదానికి ఏళ్ల చరిత్ర ఉంది. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న హమాస్‌ను ప్రపంచంలోని అనేక దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. అలాగే మానవతా ధృక్ఫథంతో పాలస్తీనాకు సహాయం అందిస్తున్న యూరప్‌లోని పలు దేశాలు ఇకపై తమ సహాయాన్ని కొనసాగించాలా వద్దా అనే డైలమాలో పడ్డాయి. అటువంటి పరిస్థితిలో హమాస్‌కు ఆర్థిక సహాయంతో పాటు ఆయుధాలు ఎక్కడ నుండి లభిస్తున్నయనే ప్రశ్న అందరి మదిలో తలెత్తుతుంది.
హమాస్‌కు మద్దతు అందించేందుకు ఇరాన్, సిరియాల నుంచి పలు రహస్య మార్గాలు ఉన్నాయి. 2005లో గాజా నుండి ఇజ్రాయెల్ వైదొలిగిన తర్వాత, సిరియా, ఇరాన్‌లను అనుసంధానిస్తూ మార్గాన్ని ఏర్పరుచుకునేందుకు హమాస్‌కు అవకాశం లభించింది. 2007లో ఇజ్రాయెల్ సూడాన్ ద్వారా హమాస్‌కు అందుతున్న ఆయుధ రవాణాను అడ్డుకుంది. అయితే దీని ప్రభావం అంతగా కనిపించలేదు.
కార్పొరేషన్ ఫర్ వరల్డ్ వైడ్ బ్రాడ్‌కాస్టింగ్ తెలిపిన వివరాల ప్రకారం సుడాన్‌కు వెళ్లే మార్గంలో ఫజర్-5 రాకెట్‌లను మోసుకెళ్తున్న ఓడను అడ్డుకోవడం బ్లాక్ మార్కెట్ ఉనికిని తెలియజేస్తుంది. హమాస్ వివిధ ఆయుధాలను సముద్ర మార్గం ద్వారా అందుకుంటుంది. ఇజ్రాయెల్ నావికాదళం కన్నుగప్పి ఇవన్నీ కొనసాగుతున్నాయంటారు. అలాగే హమాస్.. ఇరాన్, సిరియా మీదుగా ఈజిప్ట్-గాజా సరిహద్దులో ఒక రహస్య సొరంగాన్ని నిర్మించింది. దీని ద్వారా ఆయుధ రవాణా జరుగుతుందని సమాచారం.
హమాస్ ఇరాన్, సిరియాలతో సన్నిహితంగా ఉంటూనే ఫజ్ర్-3, ఫజ్ర్-5, ఎమ్302 తదితర రాకెట్లను విదేశాల నుండి కొనుగోలు చేసింది. 2014 గాజా యుద్ధంలో హమాస్ ఇజ్రాయెల్‌పై 4500 రాకెట్లను ప్రయోగించింది. హమాస్‌కు ఆయుధాలు అందించడంలో స్మగ్లర్లు, ఓడల సిండికేట్‌లు, ఫైనాన్స్ ఆపరేటర్లు మొదలైనవారు కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇది కూడా చదవండి: బంకర్లు అంటే ఏమిటి? యుద్ధ ప్రాంతాల్లో ఎందుకు అవసరం?
Comments
Please login to add a commentAdd a comment