
అందం, అభినయంతో సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేశ్. కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ పలు హిట్లను తన ఖాతాలో వేసుకొని అటు టాలీవుడ్ ఇటు కోలివుడ్‌లో ఫుల్ బిజీ నటిగా మారారు. విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస లవర్’ చిత్ర ఫలితం ఎలా ఉన్నా సువర్ణ పాత్రలో ఐశ్యర్య నటను అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం నాని చిత్రంలో నటిస్తున్న ఈ తెలుగమ్మాయి కెరీర్ ఆరంభంలో తను ఎదుర్కొన్న అవమానాలను వెల్లడించారు.
‘నా కెరీర్ ఆరంభంలో నేను కూడా లైంగిక వేధింపులతో పాటు వర్ణ వివక్షను కూడా ఎదుర్కొన్నాను. నా రంగు నలుపు అని చాలా మంది అవహేళన చేశారు. నేను హీరోయిన్ మెటీరియల్ కాదని ఓ స్టార్ డైరెక్టర్ కించ పరచే విధంగా మాట్లాడాడు. కమెడియన్ పక్కన తప్ప హీరో పక్కన నేను సెట్ అవ్వనని కూడా ఆయన అన్నారు. అయితే ఈ అవమానాలేవి నన్ను ఆపలేదు. నేనుబోల్డ్‌గా ఉంటాను. ఆ లక్షణమే నన్ను నిలబెట్టిందనుకుంటాను. సమస్యల్ని స్వీకరించడం నాకు తెలుసు. ఎవరూ నన్ను నమ్మనప్పుడు నన్ను నేను నమ్మాను. అందుకే.. బాధల్ని ఓర్చుకున్నాను’ అంటూ ఐశ్వర్య రాజేశ్ వ్యాఖ్యానించారు.
ఇక ఐశ్వర్య రాజేశ్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచే వచ్చిన విషయం తెలిసిందే. ఆమె తండ్రి రాజేశ్ అప్పట్లో పలు చిత్రాల్లో నటుడిగా కనిపించారు. అంతేకాకుండా ప్రముఖ నటి శ్రీలక్ష్మి మేనకోడలే ఐశ్వర్య రాజేశ్ అన్న విషయం కొంతమందికే తెలుసు. ఇక సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన నటికి కూడా లైంగింక వేదింపులు, వర్ణ వివక్ష తప్పకపోవడం గమనార్హం అని పలువురు వాపోతున్నారు.
చదవండి:
త్రివిక్రమ్ డైరెక్షన్.. వెంకీ, నాని హీరోలు!
యూట్యూబ్ ట్రెండింగ్‌లో ‘నో పెళ్లి’
Comments
Please login to add a commentAdd a comment