వారి అంతరంగం గ్రహించేస్తా.. | Rakul Preet Singh About Casting Couch In Film Industry | Sakshi
Sakshi News home page

నేనెప్పుడూ జాగ్రత్తగానే ఉంటా!

Published Mon, Oct 8 2018 11:17 AM | Last Updated on Mon, Oct 8 2018 11:17 AM

Rakul Preet Singh About Casting Couch In Film Industry - Sakshi

సినిమా: ఎవరితోనైనా కొన్ని నిమిషాలు మాట్లాడితే చాలు వారి అంతరంగ విషయాలేమిటన్నది ఇట్టే గ్రహించేస్తానంటోంది నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం తమిళంలో సోదర ద్వయం సూర్య, కార్తీలతో తలా ఒక చిత్రం చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో ఒక చిత్రం, హిందీలో ఒక చిత్రం చేస్తోంది. అయితే మునుపుటంత స్పీడ్‌ లేకపోయినా ఖాళీగా మాత్రం లేకుండా బండిని నడిపేస్తుంది. అలా సినిమాల్లో సీనియర్‌ నటిగా కొనసాగుతున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌ తన అనుభవాలను ఎలా ఏకరువు పెట్టిందో చూద్దాం. ఇక చిత్రం జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. అయితే చిత్రంలో నేను నటించిన పాత్ర పేరు తెచ్చిపెడుతుందా? లేదా? అన్నది నేను గ్రహించగలను. ఒకరితో కొన్ని నిమిషాలు మాట్లాడితే చాలు ఆయన అంతరంగ విషయాలేమిటో ఇట్టే అర్థం చేసుకోగలను. అలాంటి నేను చిత్ర కథలో సత్తా ఉందా? లేదా? అన్నది తెలుసుకోగలను. నేను ఈ రంగంలోకి వచ్చి చాలా సంవత్సరాలైంది. ఆ అనుభవంతో చెబుతున్నాను.

కొన్ని సమయాల్లో పరిస్థితుల ప్రభావం కారణంగా మంచి చిత్రాలు కూడా అపజయం పొందాయి. అయితే కథ, పాత్రల విషయంలో మాత్రం నా లెక్కలు ఎప్పుడూ తప్పలేదు. మంచి కథ అని నేను భావించిన చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. కథలను ఎంపిక చేసుకోవడంలో నేనెప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను. ఒక నటిగా నా దృష్టి ఎప్పుడూ మంచి కథాపాత్రలపైనే ఉంటుంది. అయితే అన్ని వేళలా నేను ఆశించిన కథా పాత్రలు రావడం లేదు. దీంతో ఇంట్లో ఖాళీగా ఎందుకు  కూర్చోవాలి. అందుకే స్టార్‌ హీరోలకు జంటగా కమర్శియల్‌ కథా చిత్రాల్లో డ్యూయెట్లు పాడి నటించేస్తున్నాను. అయితే ఇకపై విరామం తీసుకుని అయినా మంచి కథా పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నాను అని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అంటోంది. ఈ నెల 10న అమ్మడి పుట్టిన రోజు. నాలుగు రోజుల ముందే పుట్టినరోజు వేడుకతో సందడి చేసింది. అదేంటి అని అనుకుంటున్నారా? రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తున్న తాజా చిత్రాల్లో దేవ్‌ ఒకటి. కార్తీతో జతకట్టిన ఈ చిత్రానికి సంబంధించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ పాత్ర సన్నివేశాలు శనివారంతోనే పూర్తి అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్‌ షూటింగ్‌ స్పాట్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్‌ పుట్టినరోజు వేడుకను వేడుకగా నిర్వహించారు. ఈ బ్యూటీ పెద్ద కేక్‌ను కట్‌ చేసి చిత్ర యూనిట్‌ వర్గాలతో తన ఆనందాన్ని పంచుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement