‘రేప్‌ జరిగి ఉండొచ్చు.. కానీ అది నేను చేయలేదు’ | Alok Nath Reacts On Sexual Assault Allegations Against Him | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 9 2018 4:15 PM | Last Updated on Wed, Oct 10 2018 1:15 PM

Alok Nath Reacts On Sexual Assault Allegations Against Him - Sakshi

అలోక్‌ నాథ్‌

ముంబై : తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ ప్రముఖ నటుడు అలోక్‌నాథ్‌ రేప్‌ చేశాడని రచయిత, ప్రొడ్యూసర్‌ వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను అలోక్‌నాథ్‌ ఖండించారు. ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘ఈ వ్యాఖ్యలను నేను కొట్టిపారేయనూ లేను, ఒప్పుకోనూ లేను. అలా (రేప్) జరిగే ఉండొచ్చు. అయితే వేరెవరో ఆ పని చేసి ఉండవచ్చు. ఈ వ్యాఖ్యలపై నేను అంతగా మాట్లాడకపోవడమే నాకు మంచిది. ఎక్కువగా మాట్లాడితే ఈ విషయం ఇంకా విస్తరిస్తోంది. ఒకానొక సమయంలో ఆమె నేనో మంచి స్నేహితుడని చెప్పారు. కానీ ఇప్పుడు పెద్ద మాటలు అంటున్నారు. ఆమె ఆరోపణలపై స్పందించడమే ఓ పిచ్చి చర్య. ప్రస్తుత రోజుల్లో ప్రపంచం ఎలా తయారైందంటే ఆడవారేది చెబితే అదే నమ్ముతున్నారు. వారు మాట్లాడేది అబద్దమైనా పరిగణలోకి తీసుకుంటున్నారు.’ అని పేర్కొన్నారు. 

నేనేం సిగ్గుపడటం లేదు: వింటా నందా
గతంలోను ఈ ఘటన గురించి మాట్లాడానని, అప్పుడు అలోక్‌నాథ్‌ తన వ్యాఖ్యలను ఖండించలేదని వింటా నందా తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను ఎలాంటి భయం లేకుండా ఉన్నాను. కానీ అతను మాత్రం భయపడుతున్నాడు. ఈ విషయంలో న్యాయనిపుణుల సలహా తీసుకుని ముందుకు సాగుతాను. నేనేమి సిగ్గుపడటం లేదు. కానీ ఈ పని చేసినందుకు అతను సిగ్గుపడాలి.’ అని పేర్కొన్నారు.

ఇక విటా నందా సుదీర్ఘమైన తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో అత్యంత సంస్కారవంతుడుగా పేరొందిన అలోక్‌నాథ్‌ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ అలోక్‌నాథ్‌  రేప్‌ చేశాడని 20 ఏళ్ల సంఘటనను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు 90వ దశకంలో టెలివిజన్ స్టార్‌గా  వెలుగు వెలిగిన  ఆయన అప్పటి టీవీ షో ప్రధాన నటిని కూడా లైంగికంగా వేధించాడనీ,  దీనిపై ఫిర్యాదు  చేసినందుకుగాను ఆమెను షో నుంచి తొలగించారన్నారు. అతనొక తాగుబోతు, దుర్మార్గుడని, కానీ సంస్కారవంతమైన నటుడిగా  చలామణీ అయ్యాడని పేర్కొన్నారు. 

చదవండి: #మీటూ: ప్రముఖ నటుడిపై రేప్‌ ఆరోపణలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement