Alok Nath
-
అప్పటిదాకా సంస్కారి.. మందు ముట్టాడంటే మాత్రం..!
నటుడు అలోక్ నాథ్ సంస్కారవంతుడు.. అదంతా మందు ముట్టనంతవరకే! ఒక్కసారి మద్యం సేవించాడంటే మృగంలా మారిపోతాడంటోంది నటి హిమాని శివ్‌పురి. అలోక్ నాథ్‌తో కలిసి ఎన్నో ప్రాజెక్టుల్లో కలిసి నటించిన హిమాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడి బండారాన్ని బయటపెట్టింది.నాతో అసభ్యంగా..ఆమె మాట్లాడుతూ.. అలోక్ నాథ్ చాలా హుందాగా వ్యవహరిస్తాడు. కానీ సాయంత్రమైందంటే చాలు మందు ముట్టకుండా ఉండలేడు. మద్యం సేవించగానే నియంత్రణ కోల్పోతాడు. ఒకసారి నేషన్ స్కూల్ డ్రామా (ఎన్ఎస్డీ) చదివే రోజుల్లో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఎన్నడూ నా దగ్గర ఆ తప్పును రిపీట్ చేయలేదు. కానీ తాగిన మద్యం తర్వాత మాత్రం తేడాగా ప్రవర్తిస్తున్నాడని చాలామంది దగ్గరి నుంచి విన్నాను.ఉన్నపళంగా దింపేశారుఆయన్ను దగ్గరుండి చూశాను, కాబట్టి చెప్తున్నా.. తాగకముందు వరకు సంస్కారి.. ఆ తర్వాతేమో అపరిచితుడిలా మారిపోయేవాడు. ఓసారి మేము అవార్డు షోకు కలిసి వెళ్తున్నాం. అప్పటికే అతడు ఫుల్లుగా తాగి ఉన్నాడు. అతడి భార్య సైలెంట్‌గా ఉండమని పదేపదే చెప్తూనే ఉంది. కాసేపైనా నిన్ను నువ్వు తమాయించుకో అని నేను కూడా హెచ్చరించాను. తను వినిపించుకోకుండా పిచ్చిగా ప్రవర్తించడంతో అతడిని విమానంలో నుంచి దింపేశారు అని చెప్పుకొచ్చింది.కాగా గతంలో మీటూ ఉద్యం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలోనూ అలోక్ నాథ్ వేధించాడంటూ నటీమణులు నవనీత్ నషాన్, దీపిక, సంధ్య మృదుల్, నిర్మాత వింత నంద ఆరోపించడం గమనార్హం.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘మీకు ఓ భార్య, కూతురు ఉన్నారు కదా’
మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పెద్దలుగా చెలామణి అవుతోన్న వారి మీద లైంగిక వేదింపుల ఆరోపణలు రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి పనిచేయకూడదని ఇండస్ట్రీలో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇలా బహిష్కరించిన వారిలో అలోక్ నాథ్ కూడా ఉన్నారు. అయితే తాజాగా ఈయన అజయ్ దేవగణ్ ‘దే దే ప్యార్ దే’ చిత్రంలో నటించారు. ఈ రోజు చిత్ర ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ విషయం తెలిసింది. దీని గురించి అజయ్ దేవగణ్‌ని ప్రశ్నించగా.. ‘ఈ విషయం గురించి మాట్లాడ్డానికి ఇది సరైన వేదిక కాదు. కానీ అతని మీద ఆరోపణలు వచ్చే నాటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది’ అని తెలిపారు. అయితే అజయ్ సమాధానంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అజయ్ మీకు ఓ భార్య, కూతురు ఉన్నారు కదా. అలాంటప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మీ చిత్రంలో ఎలా ఉంచుతారు. ఇలాంటి వ్యక్తికి మద్దతిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. అలోక్ నాథ్ సన్నివేశాలు తొలగించాలి.. లేదా వేరే వ్యక్తితో ఆ పాత్రలో నటింపజేయాలి.. లేదంటే ఈ సినిమాను థియేటర్లో కాదు కదా కనీసం టీవీలో కూడా చూడమంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో ఆమిర్ ఖాన్‌తో పాటు మరికొందరు బాలీవుడ్ నటులు మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి నటించేది లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. @IndiaMeToo I'm not gonna watch #DeDePyaarDe until Alok Nath gets kicked from the movie...not even on tv. If @ajaydevgn is a responsible actor, he should be the one to do it. Sadly this industry does only show off abt respecting women. Fake people !! — Dr.Nitin Rathod (@SRKnitin_rathod) April 2, 2019 -
‘మీటూ’పై సినిమా.. జడ్జీ పాత్రలో అలోక్
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాల్లో, బుల్లి తెర మీద సంస్కారవంతమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అలోక్ నాథ్‌పై కూడాఆరోపణలు వచ్చాయి. రచయిత, నిర్మాత వింటా నందా అలోక్ నాథ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం.. ఆ తరువాత అలోక్ కోర్టులో ఫిర్యాదు చేయడం వంటివి తెలిసిందే. అయితే ఈ వివాదం ఓ కొలిక్కి రాకముందే అలోక్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. అదేంటంటే మీటూ ఉద్యమం నేపథ్యంలో బాలీవుడ్లో తెరకెక్కిన మైనేభీ చిత్రంలో అలోక్ నాథ్ జడ్జీ పాత్రలో నటించారు. ఈ విషయం గురించి అలోక్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ‘మైనే భీ’ అనే సినిమా చిత్రీకరణ కొన్ని రోజుల ముందే పూర్తైంది. ఇందులో నేను జడ్జి పాత్రలో నటించాను. మీకేమన్నా సమస్య ఉందా? నేను ఈ సినిమా చేస్తున్నానని మీరు బాధపడుతున్నట్లున్నారు. పేద నిర్మాతలకు ఈ సినిమాలోని నా పాత్ర అండగా నిలుస్తుంది. విడుదల కానివ్వండి’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు అలోక్. నిసార్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోనాలి రౌత్, షావర్ అలీ, ఇమ్రాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. (చదవండి : వింటా నందాకు కోర్టులో ఎదురుదెబ్బ) -
వింటా నందాకు కోర్టులో ఎదురుదెబ్బ
సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్‌నాథ్.. తనపై అత్యాచారం చేశాడంటూ ‘మీటూ ఉద్యమం’లో భాగంగా రచయిత, నిర్మాత వింటానందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలోక్ ఈ ఆరోపణలను ఖండిచడమే కాకా వింటానందాపై పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే, వింటా ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అలోక్‌పై కేసు నమోదు చేశారు. కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు అలోక్‌కి శనివారం ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. (ప్రముఖ నటుడిపై రేప్ కేస్ నమోదు) కోర్టు ఏమన్నదంటే.. తనపై అఘాయిత్యం జరిగినప్పుడు స్వీయప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వింటానందా నాడు నోరు మెదపలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అలోక్‌ను ఈ కేసులో తప్పుగా ఇరికించారనే వాదనలను కొట్టిపారేయలేమని చెప్పింది. 19 ఏళ్లక్రితం తనపై అత్యాచారం జరిగిందనీ, అప్పడు అలోక్ పెద్ద నటుడు అయినందున భయపడి నోరుమెదపలేదనే నందా ఆరోపణల్లో పస లేదని కోర్టు తేల్చింది. ‘ఆమె చెప్పిన కథ నమ్మశక్యంగా లేదు. అలోక్‌ను నిందితుడిగా పేర్కొనడానికి వింటా దగ్గర సరైన ఆధారాలు లేవనిపిస్తోంది. సంఘటన వివరాలన్నీ చెప్తున్న బాధితురాలు దాడి జరిగిన తేదీ లేదా సంవత్సరం మాత్రం చెప్పడం లేదు. అత్యాచారం జరిగింది తన ఇంట్లోనే అని నందా చెప్తోంది. అటువంటప్పుడు ఘటనకు సంబంధించిన ఆధారాలు నాశనమయ్యే వీలేలేదు’ అని కోర్టు అభిప్రాయపడింది. నందా ఇంటివైపు అలోక్ వెళ్లొద్దనీ, ఈ కేసుతో సంబంధమున్న వారిని బెదిరించడం, లంచాలు ఇవ్వడం వంటివి చేయొద్దని కోర్టు ఆంక్షలు విధించింది. -
ప్రముఖ నటుడిపై రేప్ కేస్ నమోదు
‘మీటూ ఉద్యమం’లో భాగంగా సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్ నాథ్.. తనపై అత్యాచారం చేశాడంటూ నిర్మాత వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ విషయం గురించి పెద్ద వివాదమే చేలరేగింది. అలోక్ నాథ్ ఈ ఆరోపణలను ఖండిచడమే కాకా వింటా నందాపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఇలాంటి సమయంలో అలోక్ నాథ్‌కి మరో భారీ షాక్ తగిలింది. నిర్మాత వింటా నందా ఫిర్యాదు మేరకు నటుడు అలోక్ నాథ్‌పై రేప్ కేస్ నమోదు చేశారు ముంబై పోలీసులు. ఓషివారాకు చెందిన పోలీసులు అలోక్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి మనోజ్ శర్మ వెల్లడించారు. అయితే అలోక్ నాథ్‌కు వ్యతిరేకంగా వింటా నందా మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ అతని భార్య గతంలో సెషన్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫిటిషన్ను కూడా కోర్టు కొట్టేసింది. వింటా నందా ఆరోపణల తర్వాత, పలువురు మహిళలు అలోక్ తమను కూడా లైంగికంగా వేధించాడంటూ ఆరోపించారు. దాంతో అలోక్ నాథ్ వింటా నందాపై పరువు నష్టం దావా కూడా వేశాడు. లిఖితపూర్వక క్షమాపణతోపాటు పరిహారంగా రూ.1 ఇవ్వాలని గతంలో అలోక్ డిమాండ్ చేశాడు. అలోక్ నాథ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో సీఐఎన్‌టీఏఏ(సినీ, టీవీ ఆర్టిస్ట్‌ల సంఘం) అతన్ని అసోసియేషన్ నుంచి బహిష్కరించింది. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ పంపిన నోటీసుపై కూడా అలోక్ స్పందించలేదు. -
#మీటూ: ఆయన పరువు నష్టం విలువ రూపాయే!
ముంబై : మీటూ అంటూ లైంగిక వేధింపులపై మౌనాన్ని బద్దలు చేస్తున్న బాధితులపై పరువునష్టం దావాల పర్వం మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ తనపై లైంగిక ఆరోపణలు చేసిన రచయిత, నిర్మాత వింటా నందాపై పరువు నష్టం దావా వేసారు. ఆమె ఆరోపణలను ‘నేను కొట్టిపారేయనూ లేను, ఒప్పుకోనూ లేను. రేప్ జరిగే ఉండొచ్చు. అయితే వేరెవరో ఆ పని చేసి ఉండవచ్చు.’ అంటూ చిత్ర విచిత్ర సమాధానాలు చెప్పిన అలోక్ నాథ్.. డిఫమేషన్ దావాలో కూడా ఒక్క రూపాయి నష్టపరిహారం అడిగారు. తన పరువుకు భంగం కలిగిందని, దీనికి వింటా నందా రాతపూర్వక క్షమాపణలతో పాటు ఒక్క రూపాయి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ దావా వేశారు. దీంతో ఇదేం పరువు నష్టం దావా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అలోక్ తప్పతాగి గదిలోకి వచ్చాడు..) కాగా టీవీ తెర మీద ‘సంస్కారి’గా పేరున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్.. నిజజీవితంలో సంస్కార హీనుడంటూ వింటా నందా బాంబు పేల్చిన విషయం తెలిసిందే.19 ఏళ్ల కిందట అలోక్ నాథ్ తనకు బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ‘మీటూ’ ఉద్యమంలో మరింత అగ్గి రాజుకుంది. (చదవండి: ‘రేప్ జరిగి ఉండొచ్చు.. కానీ అది నేను చేయలేదు’) #AlokNath has filed a civil defamation suit against writer producer Vinta Nanda seeking a written apology and Rs 1 as compensation. Nanda had accused Alok Nath of rape #MeToo pic.twitter.com/hSMwfsRdp1 — ANI (@ANI) October 15, 2018 -
#మీటూ : వింటా నందాపై పరువు నష్టం దావా
సాక్షి, ముంబై: మీటూ అంటూ లైంగిక వేధింపులపై మౌనాన్ని బద్దలు చేస్తున్న మహిళా బాధితులపై ఇక పరువునష్టం దావాల పర్వం మొదలైంది. తనపై లైంగిక వేధింపులు, దాడి ఆరోపణలపై న్యాయపరమైన చర్యలకు నటుడు అలోక్‌నాథ్ రంగం సిద్ధం చేసుకున్నారు. అత్యాచార ఆరోపణలు చేసినరచయిత ప్రొడ్యూసర్ వింటా నందాపై డిఫమేషన్ కేసు వేశారు. ఈ ఆరోపణలను ఖండించవచ్చు. అలాగే అంగీకరించవచ్చు. రేప్ కూడా జరిగి ఉండవచ్చు కానీ వేరేవాళ్లేవరో చేసి ఉండొచ్చు అంటూ చిత్ర విచిత్ర సమాధానాలతో తప్పించుకోవాలని ప్రయత్నించిన అలోక్ నాథ్ ఇపుడికి చట్టపరంగా సవాల్‌కు దిగారు. కాగా టీవీ తెర మీద ‘సంస్కారి’గా పేరున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్.. నిజజీవితంలో సంస్కార హీనుడంటూ వింటా నందా బాంబు పేల్చారు. 19 ఏళ్ల కిందట అలోక్ నాధ్ బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ‘మీటూ’ ఉద్యమంలో మరింత అగ్గి రాజుకున్న సంగతి తెలిసిందే. నటి తనూశీ దత్తా- నటుడు నానా పటేకర్ వివాదంతో మొదలైన మీట సెగ మీడియా, ఇతర రంగాల్లోని ‘పెద్దమనుషులను’ తాకింది. జర్నలిస్టు సంధ్యామీనన్, సింగర్ చిన్నయి శ్రీపాద తదితరులు రగిలించిన ఈ ఉద్యమం క్రమంగా రాజకీయాలతో పాటు అన్ని రంగాలకు విస్తరిస్తోంది. కేంద్రమంతి ఎంజె అక్బర్, బాలీవుడ్ దర్శకులు వికాస్ భల్, సాజిద్‌ఖాన్, సుభాయ్ ఘాయ్, కరీం మొరానీ రచయిత చేతన్ భగత్ , సీనీ గేయ రచయిత వైరముత్తు, సింగర్లు కైలాశ్ ఖేర్, కార్తీక్, రఘుదీక్షిత్.. క్రికెటర్లు.. ఇలా చెప్పుకుంటే పోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచకుల జాబితా చాంతాండంత. -
చీకటి కోణాలు
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశంలో ‘మీ టూ’ ఉద్యమం ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. ప్రస్తుతం చిత్రసీమలో చర్చలన్నీ లైంగిక వేధింపుల గురించే. ఇప్పటికే కొందరు ఫీమేల్ ఆర్టిస్టులు తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ఈ విషయంలో బాధిత నటీమణులకు సహచర నటీమణుల నుంచి మాత్రమే కాదు.. కొందరు నటులు, దర్శకులు కూడా మద్దతు ఇస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఐశ్వర్యారాయ్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘‘వేధింపులకు సంబంధించి బాధిత మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పినప్పుడు వాటిని మనం కూడా ధైర్యంగా ఇతరులతో షేర్ చేసుకోవాలి. మహిళపై వేధింపుల సమస్య కేవలం ఇప్పటిది మాత్రమే కాదు. ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు వేధింపుల గురించి ఓ ఉద్యమం నడుస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి నేను సంకోచించను. గతంలో మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడుతున్నా. భవిష్యత్‌లో మాట్లాడతాను. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు తమ గొంతును వినిపించడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతోంది’’ అని పేర్కొన్నారు. అయితే లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు వికాస్ బాల్, అలోక్నాథ్ల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అని మీడియా అడిగితే.. ఆ విషయం గురించి చెప్పకుండా ఐశ్వర్య మాట దాటేశారు. దోషులను చట్టం శిక్షిస్తుందన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తనుశ్రీ దత్తా, నానా పటేకర్‌ల వివాదం మరో స్థాయికి చేరింది. ఇటీవల తనుశ్రీకి నానా పటేకర్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా తనుశ్రీ దత్తా లాయర్లు ముంబై పోలీసులు, మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్లకు దాదాపు 40 పేజీల ప్రతులను అందజేశారు. తనుశ్రీ వివాదానికి సంబంధించి నటుడు నానా పటేకర్, నిర్మాత సమి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, దర్శకుడు రాకేష్ సారంగ్‌లు పది రోజుల్లో సంజాయిషీ చెప్పాల్సిందిగా ముంబై రాష్ట్ర మహిళా విభాగం మంగళవారం నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. క్షమాపణలు చెప్పాల్సిందే! ఫాంథమ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో ఒకరైన వికాశ్ బాల్‌పై లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత మిగిలిన ముగ్గురు (అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య, మధు మంతెన)లు ఆ సంస్థను నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్యలు వికాస్‌పై సోషల్æమీడియా ద్వారా పలు ఆరోపణలు చేశారు. దీంతో అనురాగ్, విక్రమాదిత్యలకు తాజాగా నోటీసులను పంపించారు వికాస్. ‘‘నా గురించి అనురాగ్, విక్రమాదిత్య చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. వృత్తిపరమైన అసూయ కారణంగానే నాపై అనురాగ్, విక్రమాదిత్య ఇలాంటి ఆరోపణలు చేశారనిపిస్తోంది. అలాగే నా కెరీర్‌ను, ఇమేజ్ను దెబ్బతీయాలనే ఇలా ప్లాన్ చేశారు. నాపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తెలియకుండానే పాంథమ్స్ ఫిల్మ్స్‌ను నిర్వీర్యం చేశారు. ఇందుకు నాపై వచ్చిన ఆరోపణలను వారు ఒక సాకుగా చూపించారన్నది నా ఆలోచన’’ అంటూ మూడు పేజీల లీగల్ నోటీసును అనురాగ్, విక్రమాదిత్యలకు పంపారు వికాస్ తరఫు లాయర్. మరోవైపు వికాస్ నోటీసుల విషయమై తనపై పడ్డ నింద తొలగిపోయేంత వరకు ముంబై అకాడమీ ఆఫ్ ది మూవీంగ్ ఇమేజ్ బోర్డ్ (ఎమ్ఎఎమ్ఐ) సభ్యత్వాన్ని అనురాగ్ కశ్యప్ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సంగతి ఇలా ఉంచితే... వికాస్‌పై వచ్చిన ఆరోపణలు అతన్ని రెండు ప్రాజెక్ట్‌లకు దూరం చేశాయని తెలుస్తోంది. అపస్వరం! సింగర్‌గా పలు హిట్ పాటలను ఆలపించి శ్రోతల మనసును గెల్చుకున్న కైలాష్ ఖేర్ తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృత్తిపరమైన విషయాలను చర్చించే సమయంలో కైలాష్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని గాయని సోనా మల్హోత్రా ఆరోపించారు. ఓ ఇంటర్య్వూ నిమిత్తం సింగర్ కైలాష్ ఖేర్‌ను కలవడానికి వెళ్లిన సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సోషల్ మీడియా వేదికగా ఓ జర్నలిస్ట్ కూడా ఆరోపించారు. తెలుగులో పండగలా దిగి వచ్చాడు (మిర్చి), ‘వచ్చాడయ్యో సామీ..’ (భరత్ అనే నేను), ‘యాడపోయినాడో..’ (అరవిందసమేత వీరరాఘవ) వంటి హిట్ సాంగ్స్‌ను పాడారు కైలాష్. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఏడాది దాదాపు అరడజను తెలుగు సినిమాలకు సంగీతం అందించి, మంచి ఫామ్‌లో దూసుకెళ్తున్నారు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్. ప్రస్తుతం ‘మీ టూ’ ఉద్యమంలో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. తనను లైంగికంగా వేధించారని ఓ సింగర్ సోషల్ మీడియా ద్వారా ఆరోపించారు. చక్కని స్వరం ఉన్న ఈ గాయకులపై ఇలాంటి ఆరోపణలు ‘అపస్వరం’గా అనిపిస్తున్నాయని పలువురు అనుకుంటున్నారు. భార్యను వేధించిన దర్శకుడు! మరోవైపు మరాఠీ చిత్రం ‘సైరాట్’తో దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు నాగరాజ్ మంజులేపై ఆయన మాజీ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా 18ఏళ్ల వయసులో నాగరాజ్‌తో నాకు వివాహం జరిగింది. ఆ సమయంలో దర్శకునిగా పేరు తెచ్చుకోవాలని నాగరాజ్ ఎంతగానో ప్రయత్నిస్తుండే వాడు. ఇంటికి నేనే పెద్ద కోడలిని. మా సంసారంలో వచ్చిన ఎన్నో సమస్యలను నేను ఎదుర్కొన్నాను. ఒక టైమ్‌లో నాగరాజ్ ప్రవర్తన హద్దులు దాటింది. ఇంటికి అమ్మాయిలను తెచ్చుకునేవాడు. పైగా నన్ను అబార్షన్ చేయించుకోమని వేధించాడు. రెండు, మూడుసార్లు చేయించాడు కూడా. ఇక భరించలేక 2014లో అతన్నుంచి విడిపోయాను’’ అని సునీత చెప్పినట్లు ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నాయి. నటి అమైరా దస్తూర్ కూడా మూవీ లొకేషన్లో వేధింపులు ఎదుర్కొన్నానని పేర్కొన్నట్లు చెబుతున్నారట. ‘‘సౌత్, నార్త్ ఇండస్ట్రీలో నేను లైంగిక దాడులను ఎదుర్కొనలేదు. కానీ వేరే రకమైన వేధింపులకు గురయ్యాను. వాళ్ల పేర్లు చెప్పడానికి ప్రస్తుతం నాకు ధైర్యం సరిపోవడం లేదు’’ అన్నారు అమైరా. మొత్తానికి మీటూ ఎన్నో చీకటి కోణాలను బయటకు తెస్తోందని, ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయోననే చర్చ జరుగుతోంది. ఇప్పుడిదొక ఫ్యాషన్! గాయని చిన్మయి ‘మీటూ’కి సంబంధించిన మరికొన్ని ట్వీట్స్‌ను బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంగళవారం ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు గురించి ఆమె ట్వీట్స్ చేశారు. బుధవారం వైరముత్తు స్పందిస్తూ – ‘‘అమాయకులను అవమానించడం ఇప్పుడు చాలామందికి ఓ ఫ్యాషన్ అయిపోయింది. గతంలో నా మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇది. నిజమేంటో కాలమే చెబుతుంది’’ అన్నారు. ఈ విషయంపై చిన్మయి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘వైరముత్తు అవాస్తవాలు చెబుతున్నారు’ అని పేర్కొన్నారు. -
అలోక్ తప్పతాగి గదిలోకి వచ్చాడు..
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు అలోక్ నాధ్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పలువురు మహిళలు ముందుకొస్తున్నారు. అలోక్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ రచయిత,నిర్మాత వింటూ నందా ఆరోపించగా, మరో నటి తన ఎదుట ఆయన దుస్తులు మార్చుకున్నారని, అసభ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తాజాగా ప్రముఖ నటి సంధ్యా మృదుల్ అలోక్ నాధ్ తనను లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేశారు. అలోక్ నాధ్ వేధింపులపై పేజ్3, యాంగ్రీ ఇండియన్ గాడెసెస్ వంటి సినిమాల్లో నటించిన సంధ్య బహిరంగంగా నోరుమెదిపారు. హఫ్పోస్ట్ ఇండియాలో ఓ టెలిఫిల్మ్ షూటింగ్ సందర్భంగా అలోక్ నాధ్ చేతిలో నరకం అనుభవించిన ఉదంతాన్ని వివరించారు. తన కెరీర్ తొలినాళ్లలో కొడైకెనాల్లో టెలిఫిల్మ్ షూటింగ్లో పాల్గొన్నానని, ఈ టెలిఫిల్మ్‌లో తన తండ్రి పాత్రలో నటించిన అలోక్ నాధ్ తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తన నటనను ప్రశంసిస్తూ తనను లోబరుచుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఒక రోజు రాత్రి యూనిట్ సిబ్బంది ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీ సందర్భంగా తన పక్కనే కూర్చున్న అలోక్ తప్పతాగి అమర్యాదకరంగా వ్యవహరించారని దీంతో తాను అక్కడి నుంచి బయటపడి తన హోటల్ రూమ్‌కు చేరకున్నానన్నారు. అదే రోజు రాత్రి హోటల్ రూమ్‌కు వచ్చిన అలోక్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా తాను తప్పించుకుని యూనిట్ సిబ్బందిని ఆశ్రయించానన్నారు. రూమ్‌లో తనకు తోడుగా హెయిర్ డ్రెస్సర్‌ను పంపారని ప్రతి రోజూ రాత్రి అలోక్ తన రూమ్ వద్దకు వచ్చి గొడవ చేసేవాడన్నారు. అప్పటికే అలోక్ ప్రముఖ నటుడు కావడం, తాను కెరీర్‌ను ప్రారంభించిన రోజులు కావడంతో తన ఇబ్బందులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. షూటింగ్ ముగిసి ముంబై వెళ్లిన తర్వాత తాను పొగరుబోతునని అలోక్ ఇండస్ర్టీలో ప్రచారం చేశాడన్నారు. అలోక్‌ను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టమని, వింటా నందా పట్ల ఆయన వ్యవహరించిన తీరు దారుణమని సంధ్య మండిపడ్డారు. -
అలోక్ అలాంటోడే..
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్‌పై రచయిత, నిర్మాత వింటా నందా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మరుసటి రోజే సినీ పరిశ్రమకు చెందిన మరో మహిళ అలోక్ ఆగడాలపై పెదవివిప్పారు. 1999 నాటి సల్మాన్ ఖాన్ మూవీ హమ్సాథ్సాథ్హై సెట్స్‌పై అలోక్ నాథ్ తనతో అసభ్యంగా వ్యవహరించారని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఆ మహిళ మిడ్డేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా రాత్రి వేళ షూటింగ్ సమయంలో అలోక్ తన ఎదుటే దుస్తులు మార్చుకోవడంతో షాక్‌కు గురయ్యానని, భయంతో గది నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా తన చేయిని గట్టిగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అలోక్ చేయిని వదిలించుకుని ఒక్క ఉదుటున గది నుంచి బయటపడ్డానని ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. చిత్ర మేకర్ సూరజ్ బరజాత్యతో నటుడికి సన్నిహిత సంబంధం ఉన్నందున తాను ఈ విషయం సూరజ్ దృష్టికి తీసుకువెళ్లలేదన్నారు. ఈ ఘటనతో తాను గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. అలోక్ ప్రవర్తనను బాహాటంగా బయటపెట్టిన వింటా నందా ధైర్యాన్ని మెచ్చుకోవాలని ప్రశంసించారు. మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్ సెలెబ్రిటీల బాగోతంపై బాధిత మహిళలు ఒక్కొక్కరుగా తమకెదురైన లైంగిక వేధింపులను బహిర్గతం చేస్తున్న సంగతి తెలిసిందే. -
రాజకీయాలకూ ‘మీటూ’ సెగ
న్యూఢిల్లీ: సినీ రంగాన్ని కుదిపేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయాల్ని చుట్టుముట్టాయి. కేంద్ర మంత్రి, మాజీ పత్రికా సంపాదకుడు ఎంజే అక్బర్ రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో తమని వేధించారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు గుప్పించారు. మరోవైపు, కేరళ ఎమ్మెల్యే(సీపీఎం), మాజీ నటుడు ముకేశ్ 1999లో ఓ షూటింగ్లో తనని వేధించారని బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ ఆరోపించారు. ప్రముఖ రచయిత, నిర్మాత వింతా నందా..నటుడు అలోక్‌నాథ్ 19 ఏళ్ల క్రితం తనను రేప్ చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. వెంటనే స్పందించిన సినీ ఆర్టిస్ట్స్ అండ్ టీవీ అసోసియేషన్(సింటా)..అలోక్‌నాథ్‌కు షోకాజ్ నోటీసులు పంపుతామని తెలిపింది. మీడియా రంగంలో లైంగిక వేధింపుల ఆరోపణలు వరుసగా వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఎడిటర్స్ గిల్డ్..బాధితురాళ్లకు అండగా నిలిచింది. అన్ని ఆరోపణల్లో నిష్పాక్షిక విచారణ చేపట్టాలని మీడియా సంస్థలకు సూచించింది. రంగంలోకి దిగిన జాతీయ మహిళా కమిషన్.. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. అక్బర్...ఓ ప్రిడేటర్ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో మొదలైన ‘మీటూ’ తరహా ఉద్యమం తీవ్రమైంది. అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించారు. ఫస్ట్‌పోస్ట్ అనే వెబ్‌పోర్టల్‌లో రమణి, పేరు తెలియని రచయిత అక్బర్‌ను ఉద్దేశించి పెట్టిన పోస్టుల ఆధారంగా ది టెలిగ్రాఫ్ కథనం ప్రచురించింది. ది టెలిగ్రాఫ్‌కు అక్బర్ వ్యవస్థాపక సంపాదకుడు. 2017లో వోగ్ మేగజీన్‌కు రాసిన ఓ వ్యాసంలోని విషయాలను రమణి ట్వీట్ చేశారు. ఈ వ్యాసంలో అక్బర్‌ను ఆమె ప్రిడేటర్ అని సంబోధిస్తూ..ఆయన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదని పేర్కొన్నారు. ఎడిషన్ పూర్తయ్యాక హోటల్‌కు పిలిచారు రాత్రి ఎడిషన్ ముగిశాక పని గురించి చర్చించడానికి అక్బర్ హోటల్ గదికి పిలిచారని బింద్రా ట్వీట్ చేశారు. అందుకు నిరాకరించినందుకు నరకం చూపాడని ఆరోపించారు. ‘తప్పుడు ఆరోపణల ఫలితాలు ఏంటో నాకు తెలుసు. నేను వేధింపులు భరించి 17 ఏళ్లు గడిచాయి. వాటిని నిరూపించేందుకు ప్రస్తుతం ఆధారాలు లేవు. గొప్పవాళ్లలో లోపాలుంటాయి. ఫీచర్ బృందం మొత్తం సమావేశమైనప్పుడు అక్బర్ బూతు వ్యాఖ్యలు చేశారు. హోటల్ గదిలో కలవాలని ఆ బృందంలోని వారిని కూడా కోరినట్లు సహచరిణి ఒకరు నాతో అన్నారు. మహారాష్ట్ర సచివాలయంపై వార్తను రాయడానికి వెళ్లినప్పుడు ఓ అధికారి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎవరికి ఫిర్యాదుచేయాలో నాకప్పుడు అర్థం కాలేదు. నా ఎడిటర్(అక్బర్) కూ డా అలాంటి వాడే కదా!’ అని ఆమె వాపోయారు. అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందిచేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నిరాకరించారు. ఈ వ్యవహారంలో విచారణ చేపడతారా అని విలేకర్లు ప్రశ్నించగా, సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మౌనం సమాధానం కాదని, ప్రధాని మోదీ, సుష్మా స్వరాజ్ నోరు విప్పాలని కోరింది. ది టెలిగ్రాఫ్, సన్డే, ది సండే గార్డియన్, ఏషియన్ ఏజ్, దక్కన్ క్రానికల్ పత్రికలకు అక్బర్ ఎడిటర్‌గా పనిచేశారు. నా గదినే మార్చేశాడు 1999లో ఓ కార్యక్రమ షూటింగ్ సమయంలో అప్పటి నటుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ముకేశ్ తనను వేధించారని బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ టెస్ జోసెఫ్ ఆరోపించారు. అసలు ఆ కార్యక్రమ షూటింగ్ గురించే తనకు గుర్తులేదని ముకేశ్ కొట్టిపారేశారు. క్విజ్ ప్రోగ్రాం ‘కోటీశ్వర్’ చిత్రీకరణ సమయంలో ముకేశ్..తనను అతని గదికి పిలిపించుకున్నాడని, తరువాత తన గదిని ఆయన గది పక్కకు మార్చారని ట్వీట్ చేశారు. నాటకం వేస్తుండగా అనుచిత ప్రవర్తన 2001లో ఓ నాటకం వేసేటపుడు ప్రముఖ పాటల రచయిత వరుణ్ గ్రోవర్ తనతో తప్పుగా ప్రవర్తించినట్లు బెనారస్ హిందూ వర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థిని ఒకరు ఆరోపించారు. ఆమె మాటలను గ్రోవర్ తోసిపుచ్చారు. కు‘సంస్కారి’ అలోక్‌నాథ్ సంస్కారవంతమైన పాత్రల్లో నటించే అలోక్‌నాథ్ రెండు దశాబ్దాల క్రితం తనను పలుమార్లు రేప్ చేశాడని ప్రముఖ రచయిత్రి, ‘తారా’ ఫేమ్ వింతా నందా ఆరోపించారు. ఓసారి నందా ఇంటికి పార్టీకి వెళ్లగా మద్యం తాగించి బలాత్కారానికి ఒడిగట్టాడని పేర్కొన్నారు. ‘సాయంత్రం నేను తాగిన పానీయంలో ఏదో మత్తు మందు కలిపారు. రాత్రి 2 తరువాత ఇంటికి బయల్దేరుతుండగా మధ్యలో అలోక్‌నాథ్ వచ్చి తన కారులో ఎక్కించుకున్నారు. ఆ తరువాత మరింత మద్యం తాగించి రేప్ చేశాడు. తెల్లారి లేచేసరికి చాలా నొప్పిగా అనిపిం చింది. ఈ సంగతిని నా స్నేహితులకు చెబితే మౌనంగా ఉండమన్నారు. అలోక్‌నాథ్ తన పలుకుబడితో నన్ను భయపెట్టి, తరువాతా పలుమార్లు వేధించారు’ అని వింతా నందా తాను అనుభవించిన క్షోభను వివరించారు. -
‘లైంగికంగా వేధిస్తే చెంప చెళ్లుమనిపించా’
సాక్షి, ముంబై: మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. పెద్ద మనుషుల సాగించిన అకృత్యాలు ఒక్కొక్కటీగా వెలుగులోకి వస్తున్నాయి. బాలీవుడ్లో తనుశ్రీతో మొదలైన ఈ మీటూ ఉద్యమం ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. జర్నలిస్టులు, సినీ నటులు ఒక్కొక్కరు తమ గళం విప్పుతున్నారు. ప్రముఖ సినీ, టీవీ నటుడు అలోక్‌నాథ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ మరో టీవీ నటి నవ్‌నీత్ నిషాన్ తన గళం విప్పారు. అలోక్‌నాథ్ నుంచి తనకు ఎదురైన వేధింపులను బయటి ప్రపంచానికి తెలియజేశారు. వింటా నందాకు మద్దతుగా నిలిచారు. ‘మీటూ ఉద్యమంలో భాగంగా తన కోసం నిలబడే ప్రతి మహిళకు నేను మద్దతుగా ఉంటాను. వింటాకు ఎదురైన అనుభవాన్ని, కలిగిన నొప్పిని నేను అర్థం చేసుకున్నాను. ఆ బాధను ఊహించలేం. నేను ఆ వ్యక్తి నుంచి నాలుగేళ్లుగా వేధింపులు ఎదుర్కొన్నాను. చివరకు చెంప దెబ్బతో బుద్దిచెప్పాను. దీంతో అతను నాపై కక్ష్యపూరితంగా వ్యవహరించాడు. ఆ షో నుంచి తీసేశాడు. లేనిపోనివి కల్పించి మీడియా వేదికగా నాపై అసత్య ప్రచారం చేశాడు. వాటన్నిటిపై పోరాడుతూ నేను నిలదొక్కుకున్నాను.’ అని చెప్పుకొచ్చారు. 1993-97 మధ్యలో వచ్చిన పాపులర్ టీవీ ‘తారా’ షోలో అలోక్‌నాథ్, నవ్‌నీత్ నిషాన్లు ప్రధానపాత్రల్లో నటించారు. ఆ సమయంలో ఓ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూలో అలోక్‌నాథ్ తన కోస్టారైన నవ్‌నీత్ నిషాన్ డ్రగ్స్ తీసుకుందని ఆరోపించారు. -
‘రేప్ జరిగి ఉండొచ్చు.. కానీ అది నేను చేయలేదు’
ముంబై : తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ ప్రముఖ నటుడు అలోక్‌నాథ్ రేప్ చేశాడని రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను అలోక్‌నాథ్ ఖండించారు. ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘ఈ వ్యాఖ్యలను నేను కొట్టిపారేయనూ లేను, ఒప్పుకోనూ లేను. అలా (రేప్) జరిగే ఉండొచ్చు. అయితే వేరెవరో ఆ పని చేసి ఉండవచ్చు. ఈ వ్యాఖ్యలపై నేను అంతగా మాట్లాడకపోవడమే నాకు మంచిది. ఎక్కువగా మాట్లాడితే ఈ విషయం ఇంకా విస్తరిస్తోంది. ఒకానొక సమయంలో ఆమె నేనో మంచి స్నేహితుడని చెప్పారు. కానీ ఇప్పుడు పెద్ద మాటలు అంటున్నారు. ఆమె ఆరోపణలపై స్పందించడమే ఓ పిచ్చి చర్య. ప్రస్తుత రోజుల్లో ప్రపంచం ఎలా తయారైందంటే ఆడవారేది చెబితే అదే నమ్ముతున్నారు. వారు మాట్లాడేది అబద్దమైనా పరిగణలోకి తీసుకుంటున్నారు.’ అని పేర్కొన్నారు. నేనేం సిగ్గుపడటం లేదు: వింటా నందా గతంలోను ఈ ఘటన గురించి మాట్లాడానని, అప్పుడు అలోక్‌నాథ్ తన వ్యాఖ్యలను ఖండించలేదని వింటా నందా తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను ఎలాంటి భయం లేకుండా ఉన్నాను. కానీ అతను మాత్రం భయపడుతున్నాడు. ఈ విషయంలో న్యాయనిపుణుల సలహా తీసుకుని ముందుకు సాగుతాను. నేనేమి సిగ్గుపడటం లేదు. కానీ ఈ పని చేసినందుకు అతను సిగ్గుపడాలి.’ అని పేర్కొన్నారు. ఇక విటా నందా సుదీర్ఘమైన తన ఫేస్బుక్ పోస్ట్‌లో అత్యంత సంస్కారవంతుడుగా పేరొందిన అలోక్‌నాథ్ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ అలోక్‌నాథ్ రేప్ చేశాడని 20 ఏళ్ల సంఘటనను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు 90వ దశకంలో టెలివిజన్ స్టార్‌గా వెలుగు వెలిగిన ఆయన అప్పటి టీవీ షో ప్రధాన నటిని కూడా లైంగికంగా వేధించాడనీ, దీనిపై ఫిర్యాదు చేసినందుకుగాను ఆమెను షో నుంచి తొలగించారన్నారు. అతనొక తాగుబోతు, దుర్మార్గుడని, కానీ సంస్కారవంతమైన నటుడిగా చలామణీ అయ్యాడని పేర్కొన్నారు. చదవండి: #మీటూ: ప్రముఖ నటుడిపై రేప్ ఆరోపణలు -
#మీటూ: ప్రముఖ నటుడిపై రేప్ ఆరోపణలు
సాక్షి, ముంబై: బాలీవుడ్లో ‘మీటూ’ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సినీ, మీడియా రంగాల్లో వరసగా ఒక్కొక్కరు తమ భయంకరమైన అనుభవాలను సోషల్‌మీడియా వేదికగా వెలుగులోకి తీసుకొస్తున్నారు. తాజాగా ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా ఈ కీచక పర్వంలో మరిన్ని చీకటి కోణాల్ని బహిర్గతం చేశారు. హృదయ విదారకమైన అనుభవాన్ని రెండు దశాబ్దాల తన మూగ వేదనను షేర్ చేశారు. ఇపుడు చాలామంది మహిళలు లైంగిక వేధింపులపై బయటికి వస్తున్నారు. 19ఏళ్లుగా నేను ఈ సమయంకోసం వేచి చూస్తున్నాను అంటూ ఫేస్బుక్లో భయంకరమైన విషయాలను వెల్లడించారు. సుదీర్ఘమైన తన ఫేస్బుక్ పోస్ట్‌లో అత్యంత సంస్కారవంతుడుగా పేరొందిన వ్యక్తి సినీ, టీవీ టెలివిజన్ నటుడు అలోక్‌నాథ్ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని వింటా నందా ఆరోపించారు. తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ అలోక్‌నాథ్ రేప్ చేశాడని 20 ఏళ్ల సంఘటనను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు 90వ దశకంలో టెలివిజన్ స్టార్‌గా వెలుగు వెలిగిన ఆయన అప్పటి టీవీ షో తారా (ఈ షో రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా) ప్రధాన నటిని కూడా లైంగికంగా వేధించాడనీ, దీనిపై ఫిర్యాదు చేసినందుకుగాను ఆమెను షో నుంచి తొలగించారన్నారు. ఆయనొక తాగుబోతు, దుర్మార్గుడు కానీ ప్రముఖ సంస్కారవంతమైన నటుడిగా చలామణీ అయ్యాడని పేర్కొన్నారు. ఇన్నాళ్లు తాను మౌనంగా ఉండడం వల్ల పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. తాను మరింత నష్టపోయానంటూ ఆమె నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టారు. లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తున్న బాధిత మహిళలను అభినందించిన వింటా ఇదే సరైన సమయం మీరు ఎదుర్కొన్న వేధింపులపై గొంతెత్తి అరవండి. వేటగాడి చేతుల్లో చిక్కి బాధపడుతున్న బాధిత మహిళలందరూ మౌనాన్ని వీడాలని పిలుపునిచ్చారు. అలోక్‌నాథ్‌కు నోటీసులు మరోవైపు ఈ ఆరోపణలపై స్పందించిన సినీ, టీవీ ఆర్టిస్టుల సంఘం (సీఐఎన్‌టీఏఏ) అలోక్‌నాథ్‌కు నోటీసులు జారీ చేసింది. వింటా నందా ఆరోపణలపై వివరణ యివ్వాల్సిందిగా కోరింది.