సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్‌నాథ్.. తనపై అత్యాచారం చేశాడంటూ ‘మీటూ ఉద్యమం’లో భాగంగా రచయిత, నిర్మాత వింటానందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలోక్ ఈ ఆరోపణలను ఖండిచడమే కాకా వింటానందాపై పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే, వింటా ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అలోక్‌పై కేసు నమోదు చేశారు. కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు అలోక్‌కి శనివారం ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. (ప్రముఖ నటుడిపై రేప్ కేస్ నమోదు)
కోర్టు ఏమన్నదంటే..
తనపై అఘాయిత్యం జరిగినప్పుడు స్వీయప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వింటానందా నాడు నోరు మెదపలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అలోక్‌ను ఈ కేసులో తప్పుగా ఇరికించారనే వాదనలను కొట్టిపారేయలేమని చెప్పింది. 19 ఏళ్లక్రితం తనపై అత్యాచారం జరిగిందనీ, అప్పడు అలోక్ పెద్ద నటుడు అయినందున భయపడి నోరుమెదపలేదనే నందా ఆరోపణల్లో పస లేదని కోర్టు తేల్చింది.
‘ఆమె చెప్పిన కథ నమ్మశక్యంగా లేదు. అలోక్‌ను నిందితుడిగా పేర్కొనడానికి వింటా దగ్గర సరైన ఆధారాలు లేవనిపిస్తోంది. సంఘటన వివరాలన్నీ చెప్తున్న బాధితురాలు దాడి జరిగిన తేదీ లేదా సంవత్సరం మాత్రం చెప్పడం లేదు. అత్యాచారం జరిగింది తన ఇంట్లోనే అని నందా చెప్తోంది. అటువంటప్పుడు ఘటనకు సంబంధించిన ఆధారాలు నాశనమయ్యే వీలేలేదు’ అని కోర్టు అభిప్రాయపడింది. నందా ఇంటివైపు అలోక్ వెళ్లొద్దనీ, ఈ కేసుతో సంబంధమున్న వారిని బెదిరించడం, లంచాలు ఇవ్వడం వంటివి చేయొద్దని కోర్టు ఆంక్షలు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment