Vinta Nanda
-
‘మీటూ’పై సినిమా.. జడ్జీ పాత్రలో అలోక్
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాల్లో, బుల్లి తెర మీద సంస్కారవంతమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అలోక్ నాథ్‌పై కూడాఆరోపణలు వచ్చాయి. రచయిత, నిర్మాత వింటా నందా అలోక్ నాథ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం.. ఆ తరువాత అలోక్ కోర్టులో ఫిర్యాదు చేయడం వంటివి తెలిసిందే. అయితే ఈ వివాదం ఓ కొలిక్కి రాకముందే అలోక్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. అదేంటంటే మీటూ ఉద్యమం నేపథ్యంలో బాలీవుడ్లో తెరకెక్కిన మైనేభీ చిత్రంలో అలోక్ నాథ్ జడ్జీ పాత్రలో నటించారు. ఈ విషయం గురించి అలోక్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ‘మైనే భీ’ అనే సినిమా చిత్రీకరణ కొన్ని రోజుల ముందే పూర్తైంది. ఇందులో నేను జడ్జి పాత్రలో నటించాను. మీకేమన్నా సమస్య ఉందా? నేను ఈ సినిమా చేస్తున్నానని మీరు బాధపడుతున్నట్లున్నారు. పేద నిర్మాతలకు ఈ సినిమాలోని నా పాత్ర అండగా నిలుస్తుంది. విడుదల కానివ్వండి’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు అలోక్. నిసార్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోనాలి రౌత్, షావర్ అలీ, ఇమ్రాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. (చదవండి : వింటా నందాకు కోర్టులో ఎదురుదెబ్బ) -
వింటా నందాకు కోర్టులో ఎదురుదెబ్బ
సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్‌నాథ్.. తనపై అత్యాచారం చేశాడంటూ ‘మీటూ ఉద్యమం’లో భాగంగా రచయిత, నిర్మాత వింటానందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలోక్ ఈ ఆరోపణలను ఖండిచడమే కాకా వింటానందాపై పరువు నష్టం దావా కూడా వేశారు. అయితే, వింటా ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అలోక్‌పై కేసు నమోదు చేశారు. కేసును విచారించిన ముంబై సెషన్స్ కోర్టు అలోక్‌కి శనివారం ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. (ప్రముఖ నటుడిపై రేప్ కేస్ నమోదు) కోర్టు ఏమన్నదంటే.. తనపై అఘాయిత్యం జరిగినప్పుడు స్వీయప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వింటానందా నాడు నోరు మెదపలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అలోక్‌ను ఈ కేసులో తప్పుగా ఇరికించారనే వాదనలను కొట్టిపారేయలేమని చెప్పింది. 19 ఏళ్లక్రితం తనపై అత్యాచారం జరిగిందనీ, అప్పడు అలోక్ పెద్ద నటుడు అయినందున భయపడి నోరుమెదపలేదనే నందా ఆరోపణల్లో పస లేదని కోర్టు తేల్చింది. ‘ఆమె చెప్పిన కథ నమ్మశక్యంగా లేదు. అలోక్‌ను నిందితుడిగా పేర్కొనడానికి వింటా దగ్గర సరైన ఆధారాలు లేవనిపిస్తోంది. సంఘటన వివరాలన్నీ చెప్తున్న బాధితురాలు దాడి జరిగిన తేదీ లేదా సంవత్సరం మాత్రం చెప్పడం లేదు. అత్యాచారం జరిగింది తన ఇంట్లోనే అని నందా చెప్తోంది. అటువంటప్పుడు ఘటనకు సంబంధించిన ఆధారాలు నాశనమయ్యే వీలేలేదు’ అని కోర్టు అభిప్రాయపడింది. నందా ఇంటివైపు అలోక్ వెళ్లొద్దనీ, ఈ కేసుతో సంబంధమున్న వారిని బెదిరించడం, లంచాలు ఇవ్వడం వంటివి చేయొద్దని కోర్టు ఆంక్షలు విధించింది. -
ప్రముఖ నటుడిపై రేప్ కేస్ నమోదు
‘మీటూ ఉద్యమం’లో భాగంగా సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్ నాథ్.. తనపై అత్యాచారం చేశాడంటూ నిర్మాత వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ విషయం గురించి పెద్ద వివాదమే చేలరేగింది. అలోక్ నాథ్ ఈ ఆరోపణలను ఖండిచడమే కాకా వింటా నందాపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఇలాంటి సమయంలో అలోక్ నాథ్‌కి మరో భారీ షాక్ తగిలింది. నిర్మాత వింటా నందా ఫిర్యాదు మేరకు నటుడు అలోక్ నాథ్‌పై రేప్ కేస్ నమోదు చేశారు ముంబై పోలీసులు. ఓషివారాకు చెందిన పోలీసులు అలోక్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి మనోజ్ శర్మ వెల్లడించారు. అయితే అలోక్ నాథ్‌కు వ్యతిరేకంగా వింటా నందా మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ అతని భార్య గతంలో సెషన్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫిటిషన్ను కూడా కోర్టు కొట్టేసింది. వింటా నందా ఆరోపణల తర్వాత, పలువురు మహిళలు అలోక్ తమను కూడా లైంగికంగా వేధించాడంటూ ఆరోపించారు. దాంతో అలోక్ నాథ్ వింటా నందాపై పరువు నష్టం దావా కూడా వేశాడు. లిఖితపూర్వక క్షమాపణతోపాటు పరిహారంగా రూ.1 ఇవ్వాలని గతంలో అలోక్ డిమాండ్ చేశాడు. అలోక్ నాథ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో సీఐఎన్‌టీఏఏ(సినీ, టీవీ ఆర్టిస్ట్‌ల సంఘం) అతన్ని అసోసియేషన్ నుంచి బహిష్కరించింది. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ పంపిన నోటీసుపై కూడా అలోక్ స్పందించలేదు. -
#మీటూ: ఆయన పరువు నష్టం విలువ రూపాయే!
ముంబై : మీటూ అంటూ లైంగిక వేధింపులపై మౌనాన్ని బద్దలు చేస్తున్న బాధితులపై పరువునష్టం దావాల పర్వం మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ తనపై లైంగిక ఆరోపణలు చేసిన రచయిత, నిర్మాత వింటా నందాపై పరువు నష్టం దావా వేసారు. ఆమె ఆరోపణలను ‘నేను కొట్టిపారేయనూ లేను, ఒప్పుకోనూ లేను. రేప్ జరిగే ఉండొచ్చు. అయితే వేరెవరో ఆ పని చేసి ఉండవచ్చు.’ అంటూ చిత్ర విచిత్ర సమాధానాలు చెప్పిన అలోక్ నాథ్.. డిఫమేషన్ దావాలో కూడా ఒక్క రూపాయి నష్టపరిహారం అడిగారు. తన పరువుకు భంగం కలిగిందని, దీనికి వింటా నందా రాతపూర్వక క్షమాపణలతో పాటు ఒక్క రూపాయి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ దావా వేశారు. దీంతో ఇదేం పరువు నష్టం దావా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అలోక్ తప్పతాగి గదిలోకి వచ్చాడు..) కాగా టీవీ తెర మీద ‘సంస్కారి’గా పేరున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్.. నిజజీవితంలో సంస్కార హీనుడంటూ వింటా నందా బాంబు పేల్చిన విషయం తెలిసిందే.19 ఏళ్ల కిందట అలోక్ నాథ్ తనకు బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ‘మీటూ’ ఉద్యమంలో మరింత అగ్గి రాజుకుంది. (చదవండి: ‘రేప్ జరిగి ఉండొచ్చు.. కానీ అది నేను చేయలేదు’) #AlokNath has filed a civil defamation suit against writer producer Vinta Nanda seeking a written apology and Rs 1 as compensation. Nanda had accused Alok Nath of rape #MeToo pic.twitter.com/hSMwfsRdp1 — ANI (@ANI) October 15, 2018 -
#మీటూ : వింటా నందాపై పరువు నష్టం దావా
సాక్షి, ముంబై: మీటూ అంటూ లైంగిక వేధింపులపై మౌనాన్ని బద్దలు చేస్తున్న మహిళా బాధితులపై ఇక పరువునష్టం దావాల పర్వం మొదలైంది. తనపై లైంగిక వేధింపులు, దాడి ఆరోపణలపై న్యాయపరమైన చర్యలకు నటుడు అలోక్‌నాథ్ రంగం సిద్ధం చేసుకున్నారు. అత్యాచార ఆరోపణలు చేసినరచయిత ప్రొడ్యూసర్ వింటా నందాపై డిఫమేషన్ కేసు వేశారు. ఈ ఆరోపణలను ఖండించవచ్చు. అలాగే అంగీకరించవచ్చు. రేప్ కూడా జరిగి ఉండవచ్చు కానీ వేరేవాళ్లేవరో చేసి ఉండొచ్చు అంటూ చిత్ర విచిత్ర సమాధానాలతో తప్పించుకోవాలని ప్రయత్నించిన అలోక్ నాథ్ ఇపుడికి చట్టపరంగా సవాల్‌కు దిగారు. కాగా టీవీ తెర మీద ‘సంస్కారి’గా పేరున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్.. నిజజీవితంలో సంస్కార హీనుడంటూ వింటా నందా బాంబు పేల్చారు. 19 ఏళ్ల కిందట అలోక్ నాధ్ బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ‘మీటూ’ ఉద్యమంలో మరింత అగ్గి రాజుకున్న సంగతి తెలిసిందే. నటి తనూశీ దత్తా- నటుడు నానా పటేకర్ వివాదంతో మొదలైన మీట సెగ మీడియా, ఇతర రంగాల్లోని ‘పెద్దమనుషులను’ తాకింది. జర్నలిస్టు సంధ్యామీనన్, సింగర్ చిన్నయి శ్రీపాద తదితరులు రగిలించిన ఈ ఉద్యమం క్రమంగా రాజకీయాలతో పాటు అన్ని రంగాలకు విస్తరిస్తోంది. కేంద్రమంతి ఎంజె అక్బర్, బాలీవుడ్ దర్శకులు వికాస్ భల్, సాజిద్‌ఖాన్, సుభాయ్ ఘాయ్, కరీం మొరానీ రచయిత చేతన్ భగత్ , సీనీ గేయ రచయిత వైరముత్తు, సింగర్లు కైలాశ్ ఖేర్, కార్తీక్, రఘుదీక్షిత్.. క్రికెటర్లు.. ఇలా చెప్పుకుంటే పోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచకుల జాబితా చాంతాండంత. -
‘లైంగికంగా వేధిస్తే చెంప చెళ్లుమనిపించా’
సాక్షి, ముంబై: మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. పెద్ద మనుషుల సాగించిన అకృత్యాలు ఒక్కొక్కటీగా వెలుగులోకి వస్తున్నాయి. బాలీవుడ్లో తనుశ్రీతో మొదలైన ఈ మీటూ ఉద్యమం ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. జర్నలిస్టులు, సినీ నటులు ఒక్కొక్కరు తమ గళం విప్పుతున్నారు. ప్రముఖ సినీ, టీవీ నటుడు అలోక్‌నాథ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ మరో టీవీ నటి నవ్‌నీత్ నిషాన్ తన గళం విప్పారు. అలోక్‌నాథ్ నుంచి తనకు ఎదురైన వేధింపులను బయటి ప్రపంచానికి తెలియజేశారు. వింటా నందాకు మద్దతుగా నిలిచారు. ‘మీటూ ఉద్యమంలో భాగంగా తన కోసం నిలబడే ప్రతి మహిళకు నేను మద్దతుగా ఉంటాను. వింటాకు ఎదురైన అనుభవాన్ని, కలిగిన నొప్పిని నేను అర్థం చేసుకున్నాను. ఆ బాధను ఊహించలేం. నేను ఆ వ్యక్తి నుంచి నాలుగేళ్లుగా వేధింపులు ఎదుర్కొన్నాను. చివరకు చెంప దెబ్బతో బుద్దిచెప్పాను. దీంతో అతను నాపై కక్ష్యపూరితంగా వ్యవహరించాడు. ఆ షో నుంచి తీసేశాడు. లేనిపోనివి కల్పించి మీడియా వేదికగా నాపై అసత్య ప్రచారం చేశాడు. వాటన్నిటిపై పోరాడుతూ నేను నిలదొక్కుకున్నాను.’ అని చెప్పుకొచ్చారు. 1993-97 మధ్యలో వచ్చిన పాపులర్ టీవీ ‘తారా’ షోలో అలోక్‌నాథ్, నవ్‌నీత్ నిషాన్లు ప్రధానపాత్రల్లో నటించారు. ఆ సమయంలో ఓ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూలో అలోక్‌నాథ్ తన కోస్టారైన నవ్‌నీత్ నిషాన్ డ్రగ్స్ తీసుకుందని ఆరోపించారు.