
‘మీటూ ఉద్యమం’లో భాగంగా సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్ నాథ్.. తనపై అత్యాచారం చేశాడంటూ నిర్మాత వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ విషయం గురించి పెద్ద వివాదమే చేలరేగింది. అలోక్ నాథ్ ఈ ఆరోపణలను ఖండిచడమే కాకా వింటా నందాపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఇలాంటి సమయంలో అలోక్ నాథ్‌కి మరో భారీ షాక్ తగిలింది. నిర్మాత వింటా నందా ఫిర్యాదు మేరకు నటుడు అలోక్ నాథ్‌పై రేప్ కేస్ నమోదు చేశారు ముంబై పోలీసులు. ఓషివారాకు చెందిన పోలీసులు అలోక్ మీద ఎఫ్‌ఐఆర్ బుక్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి మనోజ్ శర్మ వెల్లడించారు.
అయితే అలోక్ నాథ్‌కు వ్యతిరేకంగా వింటా నందా మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ అతని భార్య గతంలో సెషన్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫిటిషన్‌ను కూడా కోర్టు కొట్టేసింది. వింటా నందా ఆరోపణల తర్వాత, పలువురు మహిళలు అలోక్ తమను కూడా లైంగికంగా వేధించాడంటూ ఆరోపించారు. దాంతో అలోక్ నాథ్ వింటా నందాపై పరువు నష్టం దావా కూడా వేశాడు. లిఖితపూర్వక క్షమాపణతోపాటు పరిహారంగా రూ.1 ఇవ్వాలని గతంలో అలోక్ డిమాండ్ చేశాడు. అలోక్ నాథ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో సీఐఎన్‌టీఏఏ(సినీ, టీవీ ఆర్టిస్ట్‌ల సంఘం) అతన్ని అసోసియేషన్ నుంచి బహిష్కరించింది. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ పంపిన నోటీసుపై కూడా అలోక్ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment