
నటుడు అలోక్ నాథ్ సంస్కారవంతుడు.. అదంతా మందు ముట్టనంతవరకే! ఒక్కసారి మద్యం సేవించాడంటే మృగంలా మారిపోతాడంటోంది నటి హిమాని శివ్‌పురి. అలోక్ నాథ్‌తో కలిసి ఎన్నో ప్రాజెక్టుల్లో కలిసి నటించిన హిమాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడి బండారాన్ని బయటపెట్టింది.
నాతో అసభ్యంగా..
ఆమె మాట్లాడుతూ.. అలోక్ నాథ్ చాలా హుందాగా వ్యవహరిస్తాడు. కానీ సాయంత్రమైందంటే చాలు మందు ముట్టకుండా ఉండలేడు. మద్యం సేవించగానే నియంత్రణ కోల్పోతాడు. ఒకసారి నేషన్ స్కూల్ డ్రామా (ఎన్‌ఎస్‌డీ) చదివే రోజుల్లో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఎన్నడూ నా దగ్గర ఆ తప్పును రిపీట్ చేయలేదు. కానీ తాగిన మద్యం తర్వాత మాత్రం తేడాగా ప్రవర్తిస్తున్నాడని చాలామంది దగ్గరి నుంచి విన్నాను.
ఉన్నపళంగా దింపేశారు
ఆయన్ను దగ్గరుండి చూశాను, కాబట్టి చెప్తున్నా.. తాగకముందు వరకు సంస్కారి.. ఆ తర్వాతేమో అపరిచితుడిలా మారిపోయేవాడు. ఓసారి మేము అవార్డు షోకు కలిసి వెళ్తున్నాం. అప్పటికే అతడు ఫుల్లుగా తాగి ఉన్నాడు. అతడి భార్య సైలెంట్‌గా ఉండమని పదేపదే చెప్తూనే ఉంది. కాసేపైనా నిన్ను నువ్వు తమాయించుకో అని నేను కూడా హెచ్చరించాను. తను వినిపించుకోకుండా పిచ్చిగా ప్రవర్తించడంతో అతడిని విమానంలో నుంచి దింపేశారు అని చెప్పుకొచ్చింది.
కాగా గతంలో మీటూ ఉద్యం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలోనూ అలోక్ నాథ్ వేధించాడంటూ నటీమణులు నవనీత్ నషాన్, దీపిక, సంధ్య మృదుల్, నిర్మాత వింత నంద ఆరోపించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment